Share News

కౌంటింగ్‌లో జాగ్రత్తగా ఉండాలి

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:49 AM

ఎన్నికల కౌంటింగ్‌ రోజున ఈవీఎం యూనిట్లలో పోలైన ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు సందర్భంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఆర్వోలు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో లెక్కింపు రోజున నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

కౌంటింగ్‌లో జాగ్రత్తగా ఉండాలి

  • జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

దివాన్‌చెరువు, జూన్‌ 2: ఎన్నికల కౌంటింగ్‌ రోజున ఈవీఎం యూనిట్లలో పోలైన ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు సందర్భంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఆర్వోలు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో లెక్కింపు రోజున నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌లో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు వ్యవహరించాలన్నారు. రౌండ్‌లవారీగా ఫలితాలు ప్రకటన, గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించే క్రమంలో నిబ్బరంగా వ్యవహరించాలన్నారు. ఏజెంట్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాస్తవ పరిస్థితిని వివరించి లెక్కింపు సజావుగా సాగేందుకు సమయోచితంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. లెక్కింపు సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై ఎన్నికల సంఘం పంపిన సర్క్యూలర్ల ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన మీడియా విభాగంలో ఏర్పాటుచేస్తున్న డిజిటల్‌ స్ర్కీన్లు తదితర ఏర్పాట్లను జేసీ తేజ్‌భరత్‌తో కలసి పరిశీలించి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్‌ ఆర్వో , జేసీ ఎన్‌.తేజ్‌భరత్‌, రాజమండ్రిఅర్బన్‌ ఆర్వో, మునిసిపల్‌ కమీషనర్‌ కే.దినేష్‌కుమార్‌, కొవ్వూరు ఆర్వో, సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌శ్రీవాత్సవ్‌, డీఆర్వో జీ.నరసింహులు, రాజానగరం ఆర్వో, ఆర్డీఓఏ.చైత్రవర్షిణి, గోపాలపురం ఆర్వో కె.ఎల్‌.శివజ్యోతి, అనపర్తి ఆర్వో ఎం.మాధురీ, నిడదవోలు ఆర్వో ఆర్‌.వి.రమణానాయక్‌, రాజమండ్రిపార్లమెంట్‌ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌డిసి ఆర్‌.కృష్ణానాయక్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం.భానుప్రకాష్‌, పి.సువర్ణ పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:49 AM