Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కాపర్‌ చోరులు

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:04 AM

ఇటీవల పెద్దాపురం మండలం రాయభూపాల పట్నంలో ఉన్న పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన రాగితీగ చోరీకి గురైంది. గత మూడు నెలల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించి అందులో రాగి వైరును అపహరించుకుపోయారు. ఇటీవల గండేపల్లి మండలంలో అర్ధరాత్రి సమయంలో ఒకేరోజు రాత్రి ఐదు ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి తీగను దొంగిలించారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు అందింది.

కాపర్‌ చోరులు
పెద్దాపురం మండలం ఆర్‌బీ పట్నంలో ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ను చోరీ చేసిన దృశ్యం (ఫైల్‌)

  • పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మాయం

  • అందులో రాగి వైరును చోరీ చేస్తున్న దొంగలు

  • ప్రాణాంతకమని తెలిసినా బరితెగింపు

  • ముఠాలుగా ఏర్పడి యథేచ్ఛగా దొంగతనాలు

ఇటీవల పెద్దాపురం మండలం రాయభూపాల పట్నంలో ఉన్న పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన రాగితీగ చోరీకి గురైంది. గత మూడు నెలల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించి అందులో రాగి వైరును అపహరించుకుపోయారు. ఇటీవల గండేపల్లి మండలంలో అర్ధరాత్రి సమయంలో ఒకేరోజు రాత్రి ఐదు ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి తీగను దొంగిలించారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు అందింది.

పెద్దాపురం, మార్చి 3: ఇటీవల జిల్లావ్యా ప్తంగా పలుచోట్ల ఇలా పంట పొలాల్లో విద్యు త్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతున్నాయి. ఏటా రబీలో పంట పొలాలకు నీరు అందిం చేందుకు రైతులు మోటార్లు అమర్చుతుంటా రు. అర్ధరాత్రి పొలాల్లో దొంగలు చొరబడి వా టిని అపహరిస్తున్నారు. విద్యుత్‌ వైర్లను తొల గించి అందులో కాపర్‌(రాగి) దొంగిలించి విక్ర యిస్తున్నారు. చీకట్లో విద్యుత్‌ వైర్లను కట్‌ చేయడం ప్రాణాంతకమని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్‌ మాత్రమే సరఫరా ఉంటోం ది. అది కూడా రెండు విడతలుగా అందిస్తున్న ట్లు రైతులు చెబుతున్నారు. దీంతో విద్యుత్‌, రైతులు లేని సమయాల్లోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో దొంగతనాలు జరిగినా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానం గా దుండగులు పొలాల్లోని పాత ట్రాన్స్‌ఫార్మ ర్లను టార్గెట్‌ చేస్తున్నారు. పదేళ్ల కిందట ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చగా వాటిలో 14 కిలోల కాపర్‌ వస్తోంది. మార్కెట్‌లో కిలో కాపర్‌ ధర రూ.2,500 పలుకుతోంది. దీంతో ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ చోరీ చేస్తే రూ.30వేలకు పైనే సొమ్ము చేసుకోవచ్చని దొంగలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాపర్‌ను బరం పురం, కటక్‌, జైపూర్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయి స్తున్నట్లు సమాచారం. చోరీలనుంచి కాపర్‌ కొనుగోలు చేసే వరకూ ఒక్కో ముఠా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

రైతులకు ఇబ్బందులే..

సాధారణంగా 25 కేవీ విద్యుత్‌ టాన్స్‌ఫార్మర్‌ విలువ రూ.4లక్షల వరకూ ఉంటుంది. దానిలో కాపర్‌ విలువ రూ.70వేల వరకూ ఉంటుంది. కాపర్‌ చోరీ అవుతుండడంతో దాని కంటే తక్కువ ధరకు లభించే అల్యూమినియాన్ని విద్యుత్‌శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లలో అమర్చుతున్నారు. కాగా ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దొంగలు విద్యుత్‌వైర్లు ప్రమాదకరంగా కట్‌ చేసి అలానే వదిలేస్తుండడంతో రైతులు పొరపాటున వాటిని తాకితే ప్రమాదాలు తప్పని పరిస్థితి. పదుల సంఖ్యలో రైతులు డబ్బులు వేసుకుని ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకు న్న పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు రైతు రాయితీపోను రూ.80వేల వరకూ కట్టాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైతే సాగునీటి ఇబ్బందులతోపాటు తమపై అదనపు భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీస్‌శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించిన దాఖలాలు కనిపించడం లేదు..

ప్రమాదాలకు అవకాశం..

పొలాల్లో వ్యవసాయ బోర్లకు సంబంధించి ట్రాన్స్‌ ఫార్మర్లు దొంగిలించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో కొత్తది అమర్చేసరికి చాలారోజులు పడతాయి. ఇంతలో పంటలు పూర్తిగా ఎండిపోతాయి. విద్యుత్‌వైర్లు కత్తిరిస్తుండడంతో ప్రమా దాలు కూడా జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి పాల్పడుతున్నవారిని పోలీసులు అరెస్టు చేయాలి.

-కె.రామ్మూర్తి, రైతు, ఆర్‌బీ పట్నం

Updated Date - Mar 04 , 2024 | 12:04 AM