శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలి
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:47 PM
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఎన్‌వీ మహేష్ ఆధ్వర్యంలో హోం మంత్రి తానేటి వనితకు సోమవారం వినతిపత్రం అందజేశారు.
హోం మంత్రికి ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్ల వినతి
గోపాలపురం, జనవరి 29: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఎన్‌వీ మహేష్ ఆధ్వర్యంలో హోం మంత్రి తానేటి వనితకు సోమవారం వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పనిదినాల లక్ష్యాన్ని రద్దు చేయాలని, జూనియర్, సీనియర్ మేట్, ఫీల్డ్‌అసిస్టెంట్ అనే భేదం లేకుండా అందర్ని ఫీల్డ్‌అసిస్టెంట్‌లుగా గురించాలని, 16 ఏళ్ల సీనియార్టీని గుర్తించి శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. సీనియార్టి, విద్యార్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.