Share News

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 01:58 AM

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజలకు  వినాయక చవితి శుభాకాంక్షలు

రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌, సెప్టెంబరు 6: జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గణపతి ఉత్సవాలు చేసేవారు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా భాగస్వాములు కావాలన్నారు. చవితి పండుగ జరుపు విధానంలో ప్రకృతిలో సహజంగా లభించే వాటితోనే చేయడం పురాతనకాలం నుంచి ఆచారంగా వస్తోందన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తదితర నీటిలో కరగని వా టిని ఉపయోగించి తయారుచేసిన విగ్రహాలను పూజ లో వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉత్స వాల సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జిల్లా పోలీస్‌ యంత్రాంగం సూచనలు పాటించాలని కోరారు. ప్రజలు సంతోషంగా వినాయక చవితి పండుగ జరపాలని ఆకాంక్షించారు.

Updated Date - Sep 07 , 2024 | 01:58 AM