Share News

పూర్తయిన డొంకరాయి పవర్‌ కెనాల్‌ పనులు

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:53 AM

డొంకరాయి పవర్‌ కెనాల్‌ నిర్వహణ పనులు ఆదివారం సాయంత్రంతో ముగుస్తాయని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు

పూర్తయిన డొంకరాయి పవర్‌ కెనాల్‌ పనులు

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ ఇంజనీర్‌ ప్రశాంత్‌కుమార్‌

మోతుగూడెం, జూన్‌ 8: డొంకరాయి పవర్‌ కెనాల్‌ నిర్వహణ పనులు ఆదివారం సాయంత్రంతో ముగుస్తాయని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి నుంచి లేదా సోమవారం ఉదయం నుంచి డొంకరాయి పవర్‌ కెనాల్‌ ఎల్‌సీ అనుమతులు బ్యాక్‌ చేయనున్నామన్నారు. గత నెల 28 నుంచి డొంకరాయి పవర్‌ కెనాల్‌కు అనుమతులు మంజూరు కావడంతో 16 కిలోమీటర్ల పొడవు గల డొంకరాయి పవన్‌ కెనాల్‌ రెండు రీచ్‌ల్లో కెనాల్‌ గట్లు బాగా దెబ్బతిన్న ప్రదేశాల్లో గ్రౌంటింగ్‌ పనులను, కెనాల్‌ అడుగు భాగంలో కాంక్రీట్‌ పనులను దాదాపు పూర్తి చేశామన్నారు. ఆదివారం ఎక్కడైన చిన్నచిన్న పనులు మిగిలి ఉంటే వాటిని కూడా ఆదివారం సాయంత్రంలోపు పనులు పూర్తి చేయిస్తామని అనంతరం గ్రిడ్‌ అధికార్ల ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి లేదా సోమవారం నుంచి డొంకరాయి పవర్‌ కెనాల్‌లో నీటిని విడుదల చేసి పొ ల్లూరు, డొంకరాయి జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

కెనాల్‌ పనులను పరిశీలించిన జెన్‌కో సీఈ

డొంకరాయి కెనాల్‌ మరమ్మత్తుల పనులను సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్రీధర్‌ శనివారం పరిశీలించారు. 16 కిలోమీటర్ల పరిధిలో గల రెండు రీచ్‌ల్లో గల గ్రౌంటింగ్‌, కాంక్రీట్‌ పనులను పరిశీలించి, ఎక్కడా ఎటువంటి నాణ్యతా లోపాలు తలెత్తకుండా అధికార్లు పర్యవేక్షణ నిరంతరం ఉండాలని ఇంజనీర్లకు సూచించారు. పనులు ఎప్పటికీ పూర్తి కానున్నాయో అక్కడ ఉన్న ఇంజనీర్లను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డొంకరాయి ఈఈలు విజయ్‌కుమార్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 01:53 AM