Share News

రానున్నది ఉమ్మడి ప్రభుత్వమే: ఎమ్మెల్యే వేగుళ్ల

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:18 AM

ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంది టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

రానున్నది ఉమ్మడి ప్రభుత్వమే: ఎమ్మెల్యే వేగుళ్ల

రాయవరం, మార్చి 15: ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంది టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని మాచవరం గ్రామంలో బూత్‌ ఇన్‌ఛార్జ్‌లు, కుటుంబ సాధికార సారధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తొలుతగా ఇటీవల మరణించిన నీటి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మల్లిడి ఆదినారాయణరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఈకార్యక్రమంలో కర్రి వెంకట రామకృష్ణారెడ్డి, వీరెళ్ల కృష్ణమూర్తి, సబ్బెళ్ల వెంకన్నబాబు, మేడపాటి రవీంద్రారెడ్డి, కొవ్వూరి ఆదిరెడ్డి, రిమ్మలపూడి సత్యనారాయణ, కోడి చినప్న అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

పలువురు టీడీపీలో చేరిక: మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన సబ్బెళ్ల చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ రొంగల శ్రీను, నల్లమిల్లి మణికంఠరెడ్డి, మల్లిడి గణపతిరెడ్డి, రాళ్ల నాగబాబు, భామిశెట్టి వీరబాబు, వెంకటేష్‌, కట్టా రామన్న, తేలు ఏసు, గుత్తుల సీతయ్య, గెద్దాడ భూ లోకం, వల్లి వీరబాబు, పంపన సుబ్బారావు, కట్టా వీరవెంకట సత్యనారాయణ, జి.గణేష్‌, సీహెచ్‌ దుర్గా ప్రసాద్‌, సువర్ణరాజులు టీడీపీలో చేరగా వారికి ఎమ్మెల్యే వేగుళ్ల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

మండపేట: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పలువురు యువకులు వార్డుకు చెందిన యలమంచిలి శ్రీను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుళ్ల సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరినవారిలో ఉట్లరవి, మీసాల చిన్న, ఇసుకపల్లి కళాప్రతాప్‌, కాల ఉదయ్‌, బొత్స నరసింహ, జంధ్యం రాజు, ప్రదీప్‌తోపాటు పలువురు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే వేగుళ్ల కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వాని ంచారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, వాదాప్రసాదరావు, జోన్నపల్లి సూర్యారావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు ఉన్నారు.

టీడీపీలో చేరిన మాజీ ఎంపీపీ పద్మప్రియ దంపతులు

అమలాపురం టౌన్‌: అల్లవరం మాజీ ఎంపీపీ చిప్పల యామినీ పద్మప్రియ-నరేష్‌కుమార్‌ దంపతులు శుక్రవారం అమలాపురంలోని టీడీపీ లోక్‌సభ కార్యాలయం వద్ద ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో జల్లా సత్యశ్రీ, పలచోళ్ల వెంకటేశ్వరరావు, కోలా నరసింహస్వామి, కొప్పాడి వినాయక, దాసరి ఉమ, కొక్కిరిగడ్డ జయంతిబాబు, పట్నాల రమణ తదితరులు ఉన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలతో మేలు

కొత్తపేట: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి కుటుంబానికీ మేలు జరుగుతుందని కొత్తపేట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్ధి బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవార ఆయన మోడేకుర్రు శివారు రాకూర్తివారిపాలెంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బండారు ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

బీజేపీ నేతలతో బండారు భేటీ

రావులపాలెం: సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు కోరారు. బీజేపీ పదాధికారి, గుంటూరు జిల్లా ఇన్‌చార్జి తమలంపూడి రామకృష్ణారెడ్డిని శుక్రవారం ఆయన స్వగృహంలో బండారు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు పార్టీల కూటమి ఏర్పడడంతో రాష్ట్రంలోను, కొత్తపేటలోను ఉమ్మడి అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నడింపల్లి సుబ్బరాజు, చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల పట్టాభిరామారావు, కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం ఆలమూరు మండలాలకు చెందిన బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

భీమేశ్వరాలయంలో టీడీపీ అభ్యర్థి సుభాష్‌ పూజలు

ద్రాక్షారామ, మార్చి15: రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ శుక్రవారం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని సందర్శించారు. భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.సుబాష్‌ విలేకరులతో మాట్లాడుతూ తనకు టికెట్‌ ప్రకటించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, టీడీపీ యువనేత లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను శివభక్తుడినని పార్టీ టికెట్‌ ప్రకటించిన అనంతరం భీమేశ్వరస్వామివారిని దర్శించుకున్నానని అన్నారు.

ద్రాక్షారామలో ఎన్నికల ప్రచారం ప్రారంభం

అనంతరం ఆలయసమీపంలో వైశ్య సామాజికవర్గానికి చెందిన పసుమర్తి కుటుంభీకులను కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయన వెంట పలువురు అభిమానులు పాల్గొన్నారు.

గెలుపునకు సహకరించండి

టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ శుక్రవారం రామచంద్రపురం పట్టణంలో పలువురు ప్రముఖులను కలసి మద్దతు కోరారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌ఆర్‌కె రాజగోపాలనరసరాజు(గోపాల్‌బాబు)ను కలసి తన విజయానికి సహకరించాలని కోరారు. అనంతరం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌ను జనసేన కార్యాలయంలో కలిశారు. జనసేన నాయకులు వడ్డి సత్యనారాయణ, గొల్లపల్లి కృష్ణ, అంకం శ్రీను, పోతాబత్తుల విజయకుమార్‌ తదితరులను కలసి మద్దతు కోరారు.

Updated Date - Mar 16 , 2024 | 12:18 AM