Share News

ప్రచారానికి అనుమతి తప్పనిసరి

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:49 AM

ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయపార్టీల అభ్యర్థులు వారి వారి ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కే.మాధవీలత తెలిపారు.

 ప్రచారానికి అనుమతి తప్పనిసరి

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 3: ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయపార్టీల అభ్యర్థులు వారి వారి ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కే.మాధవీలత తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్నారు. ఎన్ని కల కమీషన్‌ మార్గదర్శకాలను అనుసరించి నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రచార వ్యవధిలో అభ్యర్థి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ (ఎంసీసీ) నియమనిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్నారు. ఇంటింటా ప్రచారం ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే చేసుకోవాలన్నారు. సువిధా పోర్టల్‌లో సమగ్ర సమాచారం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 8 చెక్‌ పోస్టుల ద్వారా నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 78 లక్షలు విలువ కలిగిన వాటిని సీజ్‌ చేసినట్టు తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో నరసింహులు, రాజమండ్రి పార్లమెంట్‌ ఏఆర్‌వో ఆర్‌.కృష్ణ నాయక్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:49 AM