Share News

సీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:11 AM

కాకినాడ సిటీ, జనవరి 2: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బుధవారం కాకినాడ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా, జాయిం ట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పోలీస్‌ మైదానంలో హెలిప్యాడ్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు, వైద్య శిబిరం స్పందన కౌంటర్‌ వంటివి పరిశీలించారు. రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశా

సీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ

కాకినాడ సిటీ, జనవరి 2: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బుధవారం కాకినాడ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా, జాయిం ట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పోలీస్‌ మైదానంలో హెలిప్యాడ్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు, వైద్య శిబిరం స్పందన కౌంటర్‌ వంటివి పరిశీలించారు. రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, పబ్లిక్‌ గ్యాలరీ, స్టాల్స్‌ ఏర్పాటు తదితర పనులను సీఎం పర్యటనల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిల తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీ భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్‌ తాడి విజయ్‌ భాస్కర్‌,రెడ్డి, హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ దవులూరి దొరబాబు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న, కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహరావు, జడ్పీ సీఈవో ఎ.రమణారెడ్డి, కాకినాడ, పెద్దాపు రం డీఎల్డీవోలు ఇట్ల కిషోర్‌, జె.సీతారామారావు, డీఎంహెచ్‌వో జె.నరసింహనాయక్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హరిప్రసాద్‌బాబు, మెప్మా పీడీ బి.ప్రియంవద, జిల్లా పైర్‌ ఆఫీసర్‌ సురేంద్ర ఆనంద్‌, ఆర్డీవో పీవీ సాయిప్రసాద్‌, వివిధ జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.

వాహనాల రాకపోకల మళ్లింపు

కాకినాడ క్రైం: సీఎం జగన్‌ కాకినాడ పర్యటన సందర్భంగా బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకల దారి మళ్లింపు ఉంటుందని కాకినాడ ట్రాఫిక్‌ డీఎస్పీ మొగలి వెంకటేశ్వర్రావు కోరారు. కాకినాడ పరిసర ప్రాంతాలైన ఇంద్రపాలెం బ్రిడ్జి, మాధవపట్నం సెంటర్‌, అచ్చంపేట జంక్షన్‌, వాకలపూడి ఏరియా, అన్నమ్మఘాటి సెంటర్‌, ఉప్పలంక సెంటర్‌ ప్రాంతాల నుంచి ఏ భారీ వాహనాలు ఉదయం 7 నుంచి మధ్యహ్నాం 2 గంటల వరకు కాకినాడ పట్టణ పరిధిలోనికి అను మతించబోమని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Updated Date - Jan 03 , 2024 | 01:11 AM