Share News

రేపు సీఎం జగన్‌ రోడ్‌ షో

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:53 AM

సీఎం జగన్‌ గురువారం రాజమహేంద్రవరంలో పర్య టిస్తారని మంత్రి వేణు, ఎంపీ భరత్‌ పేర్కొన్నారు.

రేపు సీఎం జగన్‌ రోడ్‌ షో

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ గురువారం రాజమహేంద్రవరంలో పర్య టిస్తారని మంత్రి వేణు, ఎంపీ భరత్‌ పేర్కొన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు పొట్టిలంక వద్ద జిల్లాలోకి ప్రవేశించి వేమగిరి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుని ముఖ్య నాయ కులతో సమావేశం అవుతారు. సాయంత్రం సుమారు 4 గంటలకు మోరంపూడి చేరుకుని తాడితోట, చర్చి పేట,ఆజాద్‌ చౌక్‌, దేవీచౌక్‌, మునిసిపల్‌ కార్యా లయం జంక్షన్‌, ఆర్యాపురం, మల్లయ్యపేట, కాతేరు వరకూ రాత్రి 7 గంటల వరకూ రాజమహేంద్రవరంలో రూర ల్‌,అర్బన్‌లో రోడ్‌ షో నిర్వహిస్తారు. అనంతరం కాతేరు నుంచి గామన్‌ బ్రిడ్జి అప్రోచ్‌ మీదుగా రోడ్డు మార్గాన దివాన్‌చెరువు నుంచి కాకినాడ జిల్లాకు వెళతారు.

Updated Date - Apr 17 , 2024 | 12:53 AM