Share News

పట్టణ ఓటరు ఇటే..

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:29 AM

సార్వత్రిక ఎన్నికలు-2024 ఫలితాల్లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 42 డివిజన్లు కూటమికి అద్భుతమైన మెజార్టీని ఇచ్చాయి. ఆయా డివిజన్లలో టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్‌చార్జ్‌లు, మాజీ కార్పొరేట్ల సమష్టి కృషి ఫలితంగా నగరంలో తొలిరౌండ్‌ నుంచి జయకేతనం ఎగురవేశారు.

పట్టణ ఓటరు ఇటే..
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం మ్యాప్‌

  • రాజమహేంద్రవరం 9వ డివిజన్‌లో అత్యధిక మెజార్టీ

  • డివిజన్ల వారీగా పైచేయి సాధించిన అభ్యర్థి

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 7: సార్వత్రిక ఎన్నికలు-2024 ఫలితాల్లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 42 డివిజన్లు కూటమికి అద్భుతమైన మెజార్టీని ఇచ్చాయి. ఆయా డివిజన్లలో టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్‌చార్జ్‌లు, మాజీ కార్పొరేట్ల సమష్టి కృషి ఫలితంగా నగరంలో తొలిరౌండ్‌ నుంచి జయకేతనం ఎగురవేశారు. నగర పరిధిలోని 9వ డివిజన్‌లో 10,693 ఓట్లకు గాను కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు 4,973 ఓట్ల పడగా వైసీపీ అభ్యర్థి భరత్‌రామ్‌కు 1599 ఓట్లు, ఇతరులకు 261 ఓట్లు పడ్డాయి. 3374 ఓట్లతో ఈ డివిజన్‌ వాసు మెజార్టీలో ప్రథమ స్థానంలో వుంది. డివిజన్ల వారీగా మార్గాని భరత్‌పై వాసు మెజార్టీని కొనసాగిస్తూ పైచేయిగా నిలిచారు.

  • డివిజన్ల వారీగా కూటమి మెజార్టీ ఇదీ..

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 42 డివిజన్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి సత్తాచాటారు. 1వ డివిజన్‌లో 2131 ఓట్ల మెజార్టీ, 2వ డివిజన్‌లో 2887, 3 వడివిజన్‌లో 1163, 4వ డివిజన్‌లో 1299, 5వడివిజన్‌లో 469, 6వ డివిజన్‌లో 1706 , 7వ డివిజన్‌లో 1092, 8వ డివిజన్‌లో 1435, 9వ డివిజన్‌లో 3374, 10వ డివిజన్‌లో 2199, 11వ డివిజన్‌లో 3139, 12వ డివిజన్‌లో 1906, 13వ డివిజన్‌లో 1043, 14వ డివిజన్‌లో 477, 15వ డివిజన్‌లో 841, 21వ డివిజన్‌లో 1738, 22వ డివిజన్‌లో 1936, 23వ డివిజన్‌లో 1285, 24వ డివిజన్‌లో 1948, 25వ డివిజన్‌లో 2230, 29వ డివిజన్‌లో 3065, 30వ డివిజన్‌లో 1418, 31 డివిజన్‌లో 1353, 32వ డివిజన్‌లో 786, 33వ డివిజన్‌లో 1234, 34వ డివిజన్‌లో 1020, 35వ డివిజన్‌లో 1331, 36వ డివిజన్‌లో 2283, 37వ డివిజన్‌లో 2358, 38వ డివిజన్‌లో 2044, 39వ డివిజన్‌లో 1991, 40వ డివిజన్‌లో 1838, 41వ డివిజన్‌లో 1575, 42వ డివిజన్‌లో 2089, 43వ డివిజన్‌లో 1734, 44వ డివిజన్‌లో 1205 ఓట్లు, 45వ డివిజన్‌లో 1014, 46వ డివిజన్‌లో 2251, 47వ డివిజన్‌లో 1010, 48వ డివిజన్‌లో 1149, 49వ డివిజన్‌లో 1274 ఓట్లు, 50వ డివిజన్‌లో 1391 ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం 71,404 ఓట్ల మెజార్టీని ఆదిరెడ్డి సాధించారు.

  • రాజమహేంద్రవరంలో సరికొత్త రికార్డు

రాజమహేంద్రవరం చరిత్రలో సరికొత్త రికార్డును టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. గతంలో ఇంత భారీ స్థాయిలో మెజార్టీని ఏ పార్టీ సాధించలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొమ్మన రాజ్‌కుమార్‌పై 26,377 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటుపై 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి భవాని టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీసీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30039 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా ఇప్పటి వరకు రాజమహేంద్రవరంలో అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు సుమారు 40,000 లోపు ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌పై 71,404 ఓట్లు మెజార్టీతో అఖండ విజయాన్ని కైవసం చేసుకున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 01:29 AM