చిరు వ్యాపారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:46 AM
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికా రంలోకి వచ్చిన తరువాత చిరువ్యాపారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తామనిఎమెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం, ఏప్రిల్ 2: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికా రంలోకి వచ్చిన తరువాత చిరువ్యాపారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తామనిఎమెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక దర్గా సెంటర్‌లో ఉన్న టీడీపీ నేత రాజాసూరిబాబురాజు స్వగృహం వద్ద మిక్చర్‌బళ్ల వర్తకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మంగళవారం మాట్లాడారు. చిరువ్యాపారులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు గుర్తుచేశారు. అనంతరం సుమారు 50మంది మిక్చ ర్ బళ్ల వ్యాపారులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ రాజప్ప పార్టీ కండువా ను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో తూతిక రాజు, కొరిపూరి రాజు, అనివిళ్ల శాస్త్రీ పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే కుట్ర రాజకీయాలు
గండేపల్లి: ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గండేపల్లిలో మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోర్పు లచ్చయ్యదొర, మండల పార్టీ అధ్యక్షుడు పోతుల మోహనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కోర్పు సాయితేజ్, కుంచే రాజా, యువ నాయకులు జాస్తి వసంత్, కందుల చిట్టిబాబు, పరిమిబాబు, దాపర్తి సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.
రజకులను ఆదుకునేది టీడీపీయే : జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట: ఇర్రిపాకలో జ్యోతుల నెహ్రూ స్వగృహం వద్ద రజక చైతన్య సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాతా సీతారాముడు ఆధ్వర్యంలో జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి రేపు రాబోయే ఎన్నికల్లో రజకులందరూ మద్దతుగా ఉంటామని హామీఇచ్చారు. సీతారాముడు మాట్లాడుతూ బీసీలను ఆదుకున్నది టీడీపీ అని ముఖ్యంగా రజక కులానికి కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా ఆదరణ పథకం ద్వారా వాషింగ్ మిష న్లు, ఇస్త్రీ పెట్టెలు, ఇలా వారి కులవృత్తులకు కావాల్సిన పనిముట్లు అందజేసి వారిని ఆదుకోవడమే కాకుండా రజక విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు టీడీపీ అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ కార్యదర్శి ఎం.పవన్‌కుమార్ పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనలోనే అన్ని వర్గాలకు మేలు
రౌతులపూడి: చంద్రబాబు ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందని, జగన్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్ర భ అన్నారు. ఎస్.పైడిపాలలో టీడీపీ నేతలు, మాజీ సర్పంచ్‌లు గొల్లు పెద్దదివాణం, సత్తిబాబు అధ్వర్యంలో మీ ఇంటికి మీ సత్యప్రభ, సూపర్ సిక్స్ పథకాలపై కార్యక్ర మం నిర్వహించారు. ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఇటంశేట్టి సూర్యభాస్కరరావు బీజేపీనేత ఉమ్మడి వెంకట్రావు, జనసేన నేతలు పాల్గొన్నారు.
సైకో పోవాలి..ప్రజలు గెలవాలి : టీడీపీ కో-ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు
సిరిపురం(కరప): రాష్ట్రంలో సాగుతున్న సైకో పాలన పోవాలని, ప్రజలు గెలవాలని టీడీపీ కాకినాడరూరల్ కో-ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు ఆకాంక్షించారు. కరప మండలం సిరిపురం గ్రామంలో మంగళవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి పంతం నానాజీని గెలిపించాలంటూ చేసిన ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడారు. అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కాకినాడరూరల్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి నానాజీ, ఎంపీ అభ్యర్ధి తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌లను గాజు గ్లాసు గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కో-కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు, టీడీపీ మండలాధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు(వెంకన్న), ఆయా పార్టీల నాయకులు చిక్కాల దొరబాబు, పంతం సందీప్, బండారు మురళి, బోగిరెడ్డి కొండలరావు, బోగిరెడ్డి గంగాధర్, మద్దూరి స్వామి, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపండి
కిర్లంపూడి: వైసీపీ దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కుమార్తె తోట సునీత అన్నారు. కిర్లంపూడిలో ఎస్సీపేటలో ఇంటిం టికీ వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటేసి నెహ్రూను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోట సర్వారాయుడు, చదరం చంటిబాబు, తూము కుమార్, కుర్ల చినబాబు, గుడాల రాంబాబు, ఆళ్ల నానాజీ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని గెద్దనాపల్లి, భూపాలపట్నం, తిమ్మాపురం, శృంగరాయునిపాలెం గ్రామాల్లో టీడీపీ దళితగళం నాయకులు ప్రచారం నిర్వహించారు.
.