Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

చిన్నారిపై వేధింపులకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ఎంపీపీ కారు డ్రైవర్‌

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:22 AM

నాల్గవ తరగతి చదువుతున్న చిన్నారిపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఎంపీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో న్యాయం కోసం రెడ్డెక్కిన బాలిక కుటుంబ సభ్యులతో కేశవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చిన్నారిపై వేధింపులకు పాల్పడుతున్న  అధికార పార్టీకి చెందిన ఎంపీపీ కారు డ్రైవర్‌

న్యాయంకోసం రోడ్డెక్కిన బాలిక కుటుంబసభ్యులు

ఎంపీపీపై దాడికి యత్నించిన మహిళలు

పరారీలో డ్రైవర్‌

కేశవరంలో ఘటన

పోలీసులు ఇరుపక్షాలకు నచ్చచెప్పి శాంతింప చేశారు

మండపేట, మార్చి 3: నాల్గవ తరగతి చదువుతున్న చిన్నారిపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఎంపీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో న్యాయం కోసం రెడ్డెక్కిన బాలిక కుటుంబ సభ్యులతో కేశవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం చేస్తామని చెప్పిన ఎంపీపీ వాసు తన వద్ద పనిచేసే కారు డ్రైవర్‌ బాలికను వేధిస్తుండటంతో న్యాయం చేయటంలో జాప్యం చేసి డ్రైవర్‌కు వంతపాడటంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం కేశవరంలో న్యాయం కోసం రోడ్డెక్కారు. గ్రామానికి చెందిన చిన్నారి స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. చిన్నారిని ఎంపీపీ డ్రైవర్‌ పాఠశాలకు వెళ్లే సమయంలో, వచ్చేటప్పుడు వెంటపడి వేధించటం చేసేవాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు నిఘా పె ట్టారు. వెంటపడుతున్నట్టు తల్లిదండ్రులకు చెబితే చిన్నారిని హతమారుస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు కూడా చిన్నారి చెప్పింది. తమ బిడ్డపై గ్రామానికి చెందిన ఎంపీపీ డ్రైవర్‌ కూసు ప్రసాద్‌ వేధింపులకు పాల్పడుతున్నాడని సీసీ పుటేజ్‌లు ఆధారంగా నిర్దారించుకున్నారు. జరిగిన సం ఘటనపై ఎంపీపీకి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఎంపీపీ కాలయాపన చేసి న్యాయం చేయకపోగా డ్రైవర్‌కి అండగా నిలవటంతో చిన్నారి తల్లిదండ్రులు న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం సాయంత్రం కేశవరం - రాజమహేంద్రవరం వెళ్లే రోడ్డులో ఆందోళనకు దిగారు. ఒక దశలో బాలిక కుటుంబసభ్యులు ఎంపీపీ వాసుపై దాడికి ప్రయత్నించగా స్థానికులు అతడిని వేరేచోటకు తర లిం చారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులు నడుమ కేశవరం రాజహేంద్రవరం రోడ్డులో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. కేశవరంలో జరిగిన సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పటంతో చిన్నారి తల్లిదండ్రులు ఎంపీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలవారిని చెదర గొట్టారు. ఎంపీపీని ఘటనా ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి పోలీసులు తరలించారు. ఈ సంఘటనపై చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ఇరుపక్షాలకు నచ్చచెప్పి గొడవను సర్దుమణి గేలా చేశారు. ఎంపీపీ డ్రైవర్‌ జరిగిన సంఘటనపై చిన్నారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పటంతో ఆందోళన విరమించారు. మండపేట రూరల్‌ ఎస్‌ఐ చైతన్యకుమార్‌ తన సిబ్బందితో పరిస్థితిని అదుపు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు.

Updated Date - Mar 04 , 2024 | 12:22 AM