చేనేత సంఘాలకు క్యాష్ క్రెడిట్ రుణాలు
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:29 AM
చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిపుష్టికి రుణ పరపతిని కల్పిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. రుణ పరపతితో చేనేత రంగాన్ని లాభదాయకంగా మార్చుకుని జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. జిల్లాలోని 19 చేనేత సహకార సంఘాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా క్యాష్ క్రెడిట్ రుణాల మంజూరు కోరుతూ రూ.13.16 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కలెక్టర్ మహేష్‌కుమార్ కమిటీ సభ్యుల అనుమతితో ఆమోద ముద్ర వేశారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి చేనేత సహకార సంఘాల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
అమలాపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిపుష్టికి రుణ పరపతిని కల్పిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. రుణ పరపతితో చేనేత రంగాన్ని లాభదాయకంగా మార్చుకుని జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. జిల్లాలోని 19 చేనేత సహకార సంఘాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా క్యాష్ క్రెడిట్ రుణాల మంజూరు కోరుతూ రూ.13.16 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కలెక్టర్ మహేష్‌కుమార్ కమిటీ సభ్యుల అనుమతితో ఆమోద ముద్ర వేశారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి చేనేత సహకార సంఘాల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చేనేత మగ్గాలకు ఆధునిక సాంకేతికతను జోడించి ఉత్పాదకతను, నాణ్యతతో పాటు సమయాన్ని ఆదా చేసుకునేలా సంగాలకు తోడ్పాటు అందించాలన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల సంక్షేమానికి వివిధ దశల్లో అండగా నిలిచి చేనేత వృత్తిని లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా భరోసా కల్పించాలన్నారు. జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో 23 చేనేత సహకార సంఘాలు ఉన్నాయని, వీటి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. సంఘాల పెట్టుబడి వ్యయం, నికర లాభం, రాబడి బేరీజు వేస్తూ మార్కెటింగ్ సౌలభ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆధునిక అభిరుచులకు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు జరగాలన్నారు. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని ఆ శాఖ అధికారులతో కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. సమావేశంలో చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు కె.పెద్దిరాజు, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ, వీవర్స్ సర్వీసెస్ సంఘం విజయవాడ ప్రతినిధి నాగేశ్వరరావు, ఆర్డీడీ బి.ధనుంజయ్, ఆప్కో ప్రతినిధి శ్రీకాంత్ పాల్గొన్నారు.