Share News

పరిశీలిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:17 AM

ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తూ, అభిప్రాయాలు తెలుసుకుంటూ ఆయా పథకాల అమలుతీరు, గ్రామ సచివాలయాల పనితీరు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకుంటూ పర్యటన సాగించారు

పరిశీలిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

గ్రామాల్లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ కృష్ణతేజ సుడిగాలి పర్యటన వివరాలు తెలుసుకునేందుకే ప్రాధాన్యం

గొల్లప్రోలు రూరల్‌, జూలై27: ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తూ, అభిప్రాయాలు తెలుసుకుంటూ ఆయా పథకాల అమలుతీరు, గ్రామ సచివాలయాల పనితీరు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకుంటూ పర్యటన సాగించారు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ మైలవరపు కృష్ణతేజ. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టిన కృష్ణతేజ శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, ప్రత్తిపాడు మండలాల్లో సుడిగాలి పర్యటన జరిపా రు. ఆద్యంతం పరిశీలన, తనిఖీలు చేస్తూనే వివరాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా తొలుత గొల్లప్రోలు మండలం వన్నెపూడి చేరుకున్నారు. ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా తవ్విన ఫారమ్‌ ఫాండ్‌ (పొలంలో చెరువు), ఉద్యావన తోటల పెంపకంలో భాగంగా పెంచిన గులాబితోటను పరిశీలించారు. ఫారమ్‌పాండ్‌ వల్ల రైతులకు కలిగే ప్రయో జనాలు గురించి ఏపీవో కొండలరావు కృష్ణతేజకు వివరించారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, మెరుగుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అకాకర, దొండ తదితర పందిరి పంటలకు ఉపాధి పథకం ద్వారా సాయం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చెందుర్తిలో ఉద్యా నవన పంటల సాగులో భాగంగా జామతోటను పరిశీలించి రైతుతో మా ట్లాడారు. చేబ్రోలులో చెత్త సంపద కేంద్రాన్ని (ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌) కృష్ణతేజ పరిశీలించారు. దీని ద్వారా ఆదాయం ఏమైనా వచ్చిందా ప్రశ్నించారు. ఎటువంటి ఆదాయం రాలేదని అధికారులు తెలిపారు. గ్రామంలో అమృత సరోవర్‌ చెరువును పరిశీలించారు. ఈ పథకం గురించి డ్వామా పీడీ వెం కటలక్ష్మి వివరించారు. కాగా చెరువు అభివృద్ధి చేసినా చెరువులోకి వచ్చే కాలువలు ఆక్రమణకు గురై మూసుకుపోయాయని రైతులు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు వైజంక్షన్‌ వద్ద ఆక్రమణలు పెరిగిపోయాయని, వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, జనసేన నాయకులు కోరారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం వాటర్‌ట్యాంకు పరిశీలనకు బురదగా మారిన రోడ్డులోనే వెళ్లి ట్యాంకును పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందికి పంచాయతీల నుంచి జీతాలు చెల్లించలేకపోతున్నామని కృష్ణతేజకు చెందుర్తి సర్పంచ్‌ అల్లి పాప తెలిపారు. పారిశుధ్య పను లు చేసే సిబ్బందికి కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని, దాంతో పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్నారు. వారి జీతాలను జిల్లా పంచాయతీ రిసోర్సు సెంటర్‌, లేదా ఇతర గ్రాంటుల నుంచి చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. వన్నెపూడిలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలని అక్కడి ప్రజలు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకంలో పుంతరోడ్లును అభివృద్ధి చేయాలని, పంటకాలువలను తవ్వించి కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు వినతిపత్రం అందించారు. జడ్పీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి, డీపీవో భారతిసౌజన్య, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, అడిషనల్‌ పీడీ వసంతమాధురి, జనసేన నేతలు బవిరిశెట్టి రాం బాబు, ఓదూరి నాగేశ్వరరావు, చల్లా చినబాబు, పినకా వెంకట్రావు, వన్నెపూడి, చెందుర్తి, చేబ్రోలు సర్పంచ్‌లు కందా నాగబాబు, అల్లి పాప, నాగరత్నం ఉన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 09:01 AM