Share News

ఆకారంలో పులి.. జాతిలో పిల్లి!

ABN , Publish Date - Sep 11 , 2024 | 01:05 AM

పులి బోనులో చిక్కలేదు..ఐదు రోజులైనా టెన్షన్‌ వీడలేదు.. నగరంలోకి వచ్చేస్తుందేమో వస్తే ఏం చేయాలి.. జాతీయ రహదారిపై వెళుతుంటే దాడి చేస్తుందేమో.. ఒక వేళ వస్తే ఏం చేయాలి.. ఇలా రకరకాల ప్రశ్నలతో సతమతమవుతున్నారు. భయంభయంగా ఉన్నారు.. అటవీ అధికారులు హైవేను ఆనుకుని ఉన్న రిజర్వు ఫారెస్టు వద్ద కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా పులి అడవిలోనే ఉందని చెప్పి మా పని అయిపోయిందన్నట్టు ప్రవర్తిస్తు న్నారు.

ఆకారంలో పులి.. జాతిలో పిల్లి!
రిజర్వు ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన బోను

భయంభయంగా జనం

రక్షణ చర్యలు చేపట్టని అటవీ శాఖ

మనుషులపై దాడి అరుదు

చిరు జంతువులే టార్గెట్‌

ఐదు రోజులకోసారి వేట

పిల్లిలాగే చిరుత పులి తీరు

ఏజెన్సీలో 300 చిరుతలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పులి బోనులో చిక్కలేదు..ఐదు రోజులైనా టెన్షన్‌ వీడలేదు.. నగరంలోకి వచ్చేస్తుందేమో వస్తే ఏం చేయాలి.. జాతీయ రహదారిపై వెళుతుంటే దాడి చేస్తుందేమో.. ఒక వేళ వస్తే ఏం చేయాలి.. ఇలా రకరకాల ప్రశ్నలతో సతమతమవుతున్నారు. భయంభయంగా ఉన్నారు.. అటవీ అధికారులు హైవేను ఆనుకుని ఉన్న రిజర్వు ఫారెస్టు వద్ద కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా పులి అడవిలోనే ఉందని చెప్పి మా పని అయిపోయిందన్నట్టు ప్రవర్తిస్తు న్నారు..చిరుత పులి ప్రవర్తన ఎలా ఉంటుంది.. ఏఏ జంతువులపై దాడి చేస్తుంది.. తదితర వివరాలతో ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. చిరుత పులి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎలా వచ్చిం దనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాజమహేంద్రవరం శివా రు రాజానగరం, దివాన్‌చెరువు పరిధిలో సుమారు 900 ఎకరాల రిజర్వు ఫారెస్టు ఉంది.ఈ ఫారెస్టులో శుక్ర వారం నుంచి అంటే గత ఐదు రోజులుగా చిరుత సంచరి స్తోంది.ఈ ప్రాంతం లాలాచెరువు హౌసింగ్‌ బోర్డుకు సమీపంలో ఉంది. ఆకాశవాణి కేంద్రం నుంచి పడమర వైపుగా చిరుత వస్తే రాజమహేంద్రవరంలోకి వచ్చే ప్రమాదం ఉంది.దిశ మార్చుకుంటే అటు లాలా చెరువు, ఇటు శ్రీరాంపురం వైపు వెళుతుంది. దీంతో రిజర్వు ఫారెస్టు చుట్టూ ఉన్న జనం ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చిరుత జీవన విధానం..

చిరుతపులి 2-5 రోజులకొకసారి వేటాడ తాయి. మూడు నాలుగు రోజులకొకసారి నీళ్లు తాగు తా యి.ఎక్కువగా ఉదయం,సాయంత్రం, రాత్రి వేళల్లో ఆహారానికి అన్వేషిస్తాయి. చీతాలు మని షిని వేటాడిన సందర్భాలు అరుదని నిపుణులు చెబు తున్నారు. నిర్మానుష్యప్రదేశంలో నక్కి ఉంటాయి. ఒక్కరోజులో 20-30 కిలోమీటర్లు సంచరిస్తుంది. ప్రస్తుతం చిరుత వేటాడి ఐదు రోజులు దాటింది కాబట్టి మళ్లీ ఆహారానికి లేదా నీటి కోసం ప్రయ త్నించే అవకాశం ఉంది.మేకలు, కోతులు దీనికి ఇ ష్టాహారంగా చెబుతారు.రిజర్వు ఫారెస్టులో కోతుల సంచారం ఎక్కువ.అంటే ఆహారానికి ఇబ్బందిలేదు.

చిన్న జంతువులే ఆహారం..

చిరుతలు..పులుల మాదిరిగా దూకుడుగా మని షిపైకి దూకే స్వభావం ఉండదు..అదిలిస్తే ప్రాణ భ యంతో దాడి చేస్తాయి.ఎందుకంటే చిరుతలు పిల్లి జాతికి చెందిన వన్య ప్రాణులు. కాబట్టి లక్షణాలు పిల్లి లాగే ఉం టాయి.అయితే వన్య మృగం కాబట్టి ఆహారానికి వేటాడే స్వభా వం ఉంటుంది.ఇళ్లల్లో తిరిగే పిల్లి నడవడికకు దగ్గరగా చిరుత ఉంటుంది. చెట్లు సులభంగా ఎక్కుతుంది. పులి అంత క్రూరంగా వేటాడదు. చాలా సులభంగా వేటాడి చెట్టుపైకి తీసుకెళ్లి రోజుల తరబడి తింటుంది. వేటకు వాసననే ఆయుధంగా ఉపయోగిస్తుంది. చిరుతకు పరి మాణం తెలుస్తుంది.దానిని బట్టి వేటాడే పద్ధతిని మార్చుకుంటుంది.పాద ముద్రలు చూసి జంతువులను గుర్తు పడుతుంది. చిరుతలు ఎక్కువగా మేకలు, గొర్రెలు, దూడలు, కోళ్లు,నక్కలు, కోతులు వంటి వాటిని వేటాడుతుంటాయి. అం దువల్ల శివారు ప్రాంతాల్లో, గ్రామాల్లోని మేకలు, గొర్రెల మందలు లేదా వాటిని కట్టేసే చోట జాగ్రత్తగా ఉండాలి.రాత్రి వేళల్లో గమనిస్తూ ఉండాలి.

వచ్చింది ఒంటరిగానా? జంటగానా?

ప్రస్తుతం రాజమహేంద్రవరం శివారులో కనిపించిన చిరుత ఒంటిరిగా వచ్చిందా? జంటగా వచ్చిందా? అనే అనుమానాలున్నాయి.ఉమ్మడి తూర్పు,ఏజెన్సీలో 300 వరకూ చిరుతపులులు మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, గుర్తేడు, పాతకోట, భద్రాచలం ఘాట్‌ ఏరియా, దేవీపట్నంపైన మంటూరు, అడ్డతీగల, రాజ వొమ్మంగి అటవీ ప్రాంతాల్లో ఉన్నాయని అంచనా. ఇవి ఒక్క ఈతలో గరిష్టంగా ఆరు పిల్లలకు జన్మ నిస్తాయి. కొంతకాలంగా తూర్పు మన్యంలో చిరుతల సంచారం పెరిగిందనే అంచనాలున్నాయి.ఆహార అన్వేషణలో భా గంగా ఇవి సంచరిస్తూ జనావాసాల్లోకి వచ్చేస్తుంటా యి. చిరుతలు ఏడాదిలో 9 నెలలు ఒంటరిగానే సం చ రిస్తాయి. జతకట్టే సమయంలో మాత్రమే జంటగా ఉం టాయి.చిరుతలకు సాధారణంగా నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు క్రాసింగ్‌ సమయం. పైగా ఇవి పులి మాదిరిగా దట్టమైన అడవుల్లో కాకుండా జనావాసాలకు కాస్త దగ్గరగానే పిల్లలకు జన్మనిస్తాయి.ఇక్కడ మగ చిరుత సంచరిస్తుందని నిర్ధారణకు వచ్చారు.దీం తో ఇప్పుడు రాజమహేంద్రవరం శివారుకు ఒంటరి చిరుత వచ్చిందా?జంట వచ్చిందా? అనే విషయం తేలాల్సి ఉంది.

గంటకు 110 కి.మీ వేగం..

ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఉసేన్‌ బోల్డ్‌ గరిష్ఠం గా గంటకు 44.72 కిలో మీటర్ల వేగంతో పరుగెత్తితే..చిరుతలు గంటకు 110 కిలోమీర్ల వరకూ వేగాన్ని అందుకుంటాయి. భూమిపై ఉన్న జంతువుల్లో పరుగులో చిరుత మొదటి స్థానంలో ఉంది. ఒక్క ఉదుటలో ఏడు మీటర్లు దూకుతుంది. కేవలం మూడు సెక న్లలో గరిష్ఠ వేగాన్ని అందుకుంటాయి. పరుగు సమయంలో చిరుత శరీరం అంతా కదులుతున్నా కళ్లు మా త్రం స్థిరంగా వేటా డే జీవిపై కేంద్రీకృతమై ఉండడం వంటి ప్రత్యేకత.

Updated Date - Sep 11 , 2024 | 01:05 AM