Share News

‘చంద్రన్న బీమా’ను పునరుద్ధరిస్తాం

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:24 AM

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10లక్షలతో చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తామని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

‘చంద్రన్న బీమా’ను పునరుద్ధరిస్తాం

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 18: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10లక్షలతో చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తామని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మల్లుల పోలయ్య అధ్యక్షతన గురువారం బండారులంకలో ‘జయహో బీసీ’ సదస్సు నిర్వహించారు. ఆనందరావు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు 50ఏళ్లకే రూ.4వేలు చొప్పున పెన్షన్‌ అందించడంతో పాటు బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయడం, శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, తెలుగు మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారి జయవెంకటలక్ష్మి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బీసీ సంఘ నాయకులు చింతా శంకరమూర్తి, పిచ్చిక శ్యామ్‌, రాజులపూడి భీముడు, బట్టు పండు, దంగేటి వెంకటేశ్వరరావు, మాడా మాధవి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో శ్యామ్‌ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్‌ పెనుమాల సునీత, కాశిన బాబి, కొండా సత్యనారాయణరాజు, కాశి చినబాబు, కొండా రామలింగేశ్వరరావు, బళ్ల శ్రీనివాసచక్రవర్తి, బొంతు శ్రీనివాస్‌, దొమ్మేటిరాధ, కడలి వెంకటేశ్వరరావు, యిళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 01:24 AM