చంద్రబాబు సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:46 AM
రావులపాలెంలోని టీడీపీ కార్యాలయ సమీపంలో బుధవారం జరిగే చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలని కొత్తపేట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు.

రావులపాలెం, ఏప్రిల్ 2: రావులపాలెంలోని టీడీపీ కార్యాలయ సమీపంలో బుధవారం జరిగే చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలని కొత్తపేట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. చంద్రబాబు ఏపక్క నుంచి ప్రసంగించాలి, సభకు వచ్చే టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు ఎక్కడి నుంచి వీక్షించాలనే అంశంపై చర్చించారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. బండారు సంజీవ్, చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల పట్టాభిరామారావు, కాసా విజయసాగర్ పాల్గొన్నారు.