Share News

చంద్రబాబు, లోకేశ్‌పై గొల్లపల్లి ఆరోపణలు తగవు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:16 AM

చంద్రబాబు, లోకేశ్‌పై గొల్లపల్లి ఆరోపణలు తగవు

చంద్రబాబు, లోకేశ్‌పై గొల్లపల్లి ఆరోపణలు తగవు

రాజోలు, ఫిబ్రవరి 29: గొల్లపల్లి సూర్యారావు వాస్తవాలు చెప్పడం నేర్చుకోవాలని మాజీ మంత్రి సుజయ్‌రంగారావు హితవు పలికారు. తాటిపాకలోని ఎంపీపీ కేతా శ్రీనివాస్‌ నివాసం వద్ద గురువారం జరిగిన నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, పార్లమెంటు ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ పాల్గొన్నారు. సమన్వయ కమిటీ సభ్యుల నుంచి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అభిప్రాయ సేకరణ చేశారు. అనంతరం సుజయ్‌రంగారావు మీడియాతో మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో టీడీపీ చాలా బలంగా ఉందన్నారు. గొల్లపల్లి సూర్యారావు ఇటీవల వైసీపీలోకి వెళ్లి చంద్రబాబు, లోకేష్‌లపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఇద్దరు మినహా ఎవరూ పార్టీని వీడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అభ్యర్థిగెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో మంగెన భూదేవి, బందెల పద్మ, కాండ్రేగుల భవానీలావణ్య, కేతా వెంకటలక్ష్మి, మోకా పార్వతి, ముదునూరి చినబాబురాజు, చెల్లింగి సత్యనారాయణ, గెడ్డం సువర్ణరాజు, గెడ్డం సింహ, సాగి పాపయ్యరాజు, యెనుమల నాగు, గుబ్బల శ్రీనివాస్‌, అడబాల యుగంధర్‌, ముప్పర్తి నాని, మొల్లేటి శ్రీనివాస్‌, చాగంటి స్వామి, రాపాక నవరత్నం, తాడి సత్యనారాయణ, ఉల్లంపర్తి భాస్కరరావు, చెల్లింగి లీలామోహన్‌శ్రీనివాస్‌, భక్తుల రవీంద్రనాధ్‌, కట్టా వెంకటరమణ, రాపాక ఆనందకుమార్‌, కోళ్ళ జయేంద్రకృష్ణ, కసుకుర్తి త్రినాధస్వామి, కడలి కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:16 AM