Share News

మన జెండా ఎగరాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:24 AM

కొవ్వూరు, నల్లజర్ల జనసంద్రమయ్యాయి. ఎటుచూసిన జనమే.. ఇసుకేస్తే రాలనంతా జనం తరలి వచ్చారు.. ఉదయం నుంచి తమ నాయకుడు చంద్రబా బు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూశారు. మహిళలు, యువకులు, పెద్దలు తారతమ్యం లేకుండా సభలకు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఇటు కొవ్వూరు పట్టణం.. అటు నల్లజర్ల జనంతో నిండిపోయాయి.

మన జెండా ఎగరాలి
అదిరిన రోడ్‌ షో : కొవ్వూరులో రోడ్‌కు ఇరువైపులా జనం

రాష్ట్ర భవిష్యత్‌ కోసమే పొత్తు

కూటమిని గెలిపించండి

కొవ్వూరు అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

కొవ్వూరులో చెత్త గోపాలపురాన బంగారమా?

ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దు చేస్తా

కొవ్వూరు, నల్లజర్లలో ప్రజాగళం సభల్లో చంద్రబాబునాయుడు

రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి/కొవ్వూరు/నల్లజర్ల, ఏప్రిల్‌ 4 : కొవ్వూరు, నల్లజర్ల జనసంద్రమయ్యాయి. ఎటుచూసిన జనమే.. ఇసుకేస్తే రాలనంతా జనం తరలి వచ్చారు.. ఉదయం నుంచి తమ నాయకుడు చంద్రబా బు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూశారు. మహిళలు, యువకులు, పెద్దలు తారతమ్యం లేకుండా సభలకు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఇటు కొవ్వూరు పట్టణం.. అటు నల్లజర్ల జనంతో నిండిపోయాయి. కొవ్వూరు పట్టణంలోని దొమ్మేరు రోడ్‌లో మట్టే ప్రసాద్‌ రైస్‌మిల్లులో ఏర్పాటుచేసిన హెలిపాడ్‌లో 4.30 గంటలకు చంద్ర బాబు దిగారు. అక్కడ నుంచి కార్లు, బైక్‌లపై కార్యకర్తలు, నాయకులు మెరకవీధి, బస్టాండ్‌ మీదుగా విజయవిహార్‌ సెంటర్‌ వరకు 2 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యలో మెరకవీధి వాటర్‌ట్యాంకు వద్ద రైతుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. అనంతరం ర్యాలీగా 5.20 గంటలకు విజయవిహార్‌ సెంటర్‌కు చేరుకుని బహిరంగ సభలో ప్రసగించారు. కొవ్వూరు పట్టణానికి ఎన్నోసార్లు వచ్చా. ఈసారి మాత్రం ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ప్రజాగళం యాత్ర ద్వారా మీలో చైతన్యం తీసుకురావడానికి వచ్చిన నాకు ఆడబిడ్డలు, యువత, తమ్ముళ్లను చూస్తే ఏ మాత్రం అనుమానం లేదు. గెలుపు మనదే అన్నారు. గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా. మళ్లీ హామీ ఇస్తున్నా కొవ్వూరు నా సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తా. మీ బాధ్యత సౌమ్యుడు, న్యాయవాది, సేవ చేయడంలో దిట్ట అయిన కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని గెలిపించండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అత్యధిక మెజార్టీ రావాలి. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని బాబు కోరారు. ఏ ఒక్కరైనా వైసీపీ తరపున పనిచేస్తే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకున్నట్టు అవుతుందన్నారు. పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు గోదావరిలో యంత్రాలతో డ్రెజ్జింగ్‌ చేసి ఇసుక తోడేయడంతో గామన్‌ వంతెన కుంగిపోయింది. హోంమంత్రిగా ఆమెకు అధికారాలు లేవుగాని, దోపిడీకి మాత్రం ఫుల్‌ అధికారాలు ఉన్నాయన్నారు. అత్యాచారాలపై ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతాయ ని బదులిచ్చిన హోంమంత్రి వనిత కు ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. దొమ్మేరులో దళిత యువకుడిని అక్ర మంగా అరెస్టు చేయడంతో అత ను ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో దళితులు తిర గబడడంతో మంత్రి భయపడిపోయి పారిపోయిందన్నారు. కొవ్వూరులో చెత్త గోపాలపురంలో బంగారమా అన్నారు. ఇది న్యాయమా అన్నారు. జగన్మోహనరెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. నీ హోంమంత్రి కొవ్వూరులో గెలవకపోతే నిన్ను ఎందుకు గెలిపించాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు అవసరం లేదు. ధనార్జనే లక్ష్యం. అటువంటి దుర్మార్గుడు జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ప్రతి ఇంటిలో టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో కలిసి ముందుకు సాగాలి. ఈ రాష్ట్రం కోసమే ఈ పొత్తు అన్నారు. 2022 ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై న్యాయవాదులు గట్టిగా పోరాడుతున్నారు. ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మా ముగ్గురి బాధ్యత కాదు.. మనందరిదీ. కూటమిని గెలిపించండన్నారు. చంద్రబాబు నాయుడికి కొవ్వూరు నియోజకవర్గంలో సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు ఘన స్వాగతం పలికారు. ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు నాగలి, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గద బహూకరించారు. వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న కొవ్వూరు ఎంపీపీ కాకర్ల నారాయుడికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల జంక్షనులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ ఎంతో మోసం చేసి ఏమీ తెలియనట్టు నంగనాచిగా మాట్లాడతాడు. ముందు సిద్ధమన్నాడు. హోర్డింగులు పెట్టాడు. ఒక్కొక్క మీటింగుకు 1500 బస్సులు. ఈ రాష్ట్రం వీళ్ల తాత జాగీరా? గోపాలపురం నుంచే పోలవరం కాలువ పోతోంది. ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక వరం వంటిది. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు. 50 లక్షల క్యూసెక్కుల నీళ్లు. ఆ ప్రాజెక్టు ప్రమాదంలో పడితే తూర్పు, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పోలవరాన్ని జగన్‌ నాశనం చేశాడు. జగన్‌ స్వార్థానికి, అవినీతికి పోలవరం బలైపోయింది. నిప్పులాగా బ్రతికాం. జగన్‌ రాజకీయ కక్షతో బురద వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాశంపై ఉమ్మి వేయడానికి చూస్తే అది ఆయన ముఖాన్నే పడుతుంద్నారు. ఎస్సీలకు నేను తీసుకొచ్చిన 27 పథకాల అమలు ఆపేశాడు. నా ఎస్సీలని అంటున్నావ్‌.. వాళ్లకు మేలు ఏం చేశావని అడుగుతు న్నాం. జగన్‌ దళితులకు ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ద్రోహం చేశాడు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి సైకో. తూర్పుగోదావరిలో ఒక దళిత డ్రైవరును వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్‌ డెలివరీ చేశాడా లేదా?.. మాస్కు అడిగిన పాపానికి విశాఖలోని డాక్టర్‌ సుధాకర్‌ని పిచ్చివాడిని చేసి చంపే శారు. సీతానగరంలో ఇసుక దోపిడీపై ప్రశ్నిస్తే శిరోముండనం చేయించారు. ఎస్సీలను చంపిన వాళ్లను పక్కన పెట్టుకుని ఊరేగుతావా?. అందుకే రంపచోడవరంలో ఆ ఎమ్మెల్సీ వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి దండ వేయబోతే ఎస్సీ కుర్రాళ్లు వచ్చి ఉరికెత్తించారు, తరిమి తరిమి కొట్టారు. అతడిని ప్రోత్సహించింది జగన్‌. వైసీపీని పాతిపెట్టాలి. ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేసే బాధ్యత మీదే. ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శం కావాలని ఉంది. రాష్ట్ర ప్ర యోజనాలు కాపాడాలనే ఆలోచనతోనే మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాం. మమ్మల్ని అర్ధం చేసుకొని ఆశీర్వదించండి. నష్ట పోయిన నా తెలుగు జాతిని ఆదు కోవడమే నా ఆలోచన. నాకు వేరే కోరికలేమీ లేవు’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జోన్‌ ఇన్‌చార్జి సుజయ కృష్ణ రంగరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళీ, గన్ని వీరాంజనేయులు, బొరగం శ్రీను, పితాని సత్యనారాయణ, జనసేన కన్వీనర్‌ దొడ్డిగర్ల సుర్ణరాజు,బీజెపీ కన్వీనర్‌ మైనం వాసు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టి.వి.రామారావు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు గొర్రెల శ్రీధర్‌, అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ మద్దిపట్ల శివరామకృష్ణ, దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్‌, నాదెళ్ళ శ్రీరామ్‌, జి.వి. ప్రసాద్‌, పరిమి రాధ, బీవీ.ము త్యాలరావు, కాక్లర తులసి, అండ్రు అనిల్‌, గన్ని హరికృష్ణ, కరుటూరి ధనంజయ్‌, షేక్‌ మీరా సాహెబ్‌, యద్దనపూడి బ్రహ్మరాజు, పసుమర్తి రతీష్‌, యలమాటి శ్రీనివాసరావు, జమ్ముల సతీష్‌, గంటా శ్రీను, కండెపు వెంకటరత్నం, నిమ్మలపూడి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వూరులో పోటీచేసేది చంద్రబాబే : ముప్పిడి

గత ఐదేళ్ల జగన్మోహనరెడ్డి విధ్వంసకర పాలనతో ప్రజలు విసుగుచెందారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుకను అందించాం. వైసీపీ నిబంధనలు తుంగలో తొక్కి గోదావరిలో ఇసుకను దోచుకుంటున్నారు. దీంతో గామన్‌ బ్రిడ్జిపై స్తంభం కుంగింది. డ్రెజ్జింగ్‌ వల్ల ఇసుక, పడవ కార్మికులు ఉపాధి దెబ్బతింది. హోంమంత్రి కొవ్వూరులో ఓటమి భయంతో గోపాలపురం వెళ్లిపోయారు. కొవ్వూరులో పోటీచేసేది నేను కాదు.. మన చంద్రబాబే.

రాజకీయ ఓనమాలు నేర్పింది చంద్రబాబే : మద్దిపాటి

అతిసామాన్యమైన దళిత కుటుంబం నుంచి వచ్చా.. చంద్రబాబు రాజకీయ ఓనమాలు నేర్పించి గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. చదువుకున్న దళిత యువకులను ప్రోత్సహించి సముచిత స్థానం కల్పించాలని ఆరాటపడే వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే చంద్రబాబుకు మనమంతా అండగా ఉందాం. సూపర్‌ సిక్స్‌ ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది. 74 ఏళ్ల వయస్సులో మండే ఎండలను సైతం లెక్కచేయకుండా నిరంతరం ప్రజల కోసం తపించే చంద్రబాబు కోసం మనం ఒక అడుగు ముందుకు వేయాలి. కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

నల్లజర్లలోనే రాత్రి బస

నారా చంద్రబాబు నాయుడు నల్లజర్లలోనే రాత్రి బస చేశారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం నల్లజర్లలోని ప్రియాంక కన్వెన్షన్‌ హాల్‌కి వెళ్ళారు. శుక్ర వారం ఉదయం ప్రముఖులతో కాన్ఫరెన్స్‌, సమావేశాలు నిర్వహిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నల్లజర్లలోనే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నల్లజర్ల హెలిపాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో నరసాపురం బయలుదేరివెళతారు.

బాపిరాజుతో మాట్లాడతా..

జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజుతో నేను స్వయంగా మాట్లాడతా.. మీరంతా కలిసి కట్టుగా పని చేసి పార్టీని గెలిపించాలి. 2009లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా ,2014లో జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించా.. బాపిరాజు పార్టీ కోసం బాగా పని చేశాడు. శుక్రవారం మాట్లాడి సమన్వయం చేస్తా. అందరూ కలసి సైకో జగన్‌ను ఓడించి ఫ్యాన్‌ను చిత్తు చిత్తు చేసి డస్ట్‌బిన్‌లో పడేయాలి.

Updated Date - Apr 05 , 2024 | 01:24 AM