Share News

ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బంది కలిగించొద్దు

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:05 AM

వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) చైర్‌ప ర్సన్‌ గంధం సునీత ఆదేశించారు. ఈ మేరకు ‘ధ్రువీకరణ పత్రాల జారీ’పై సమావేశం నిర్వ హించారు.

ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బంది కలిగించొద్దు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24(ఆంధ్ర జ్యోతి): వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) చైర్‌ప ర్సన్‌ గంధం సునీత ఆదేశించారు. ఈ మేరకు ‘ధ్రువీకరణ పత్రాల జారీ’పై సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా పీడీజే సునీత మాట్లా డుతూ ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథా రిటీ ఆదేశానుసారం ప్రభుత్వాధికా రులు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా జనన, మరణ, వివాహ, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాల ప్రాముఖ్యతను వివరిస్తున్నామన్నారు. ధ్రువీకరణప త్రాలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఈ విషయంలో ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవా ధికార సంస్థలను సంప్రదించాలని సూచించారు. జనన, మరణాల నమోదు చట్టం-1969, ఆంధ్రప్రదేశ్‌ జనన మరణ నిబంధనల నమోదు చట్టం-19 99పై రెండో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.పద్మ అవగాహన కల్పించారు. జనన, మరణ, వివాహ నమోదు ప్రక్రియను ఎంహెచ్‌వో డాక్టర్‌ ఏ.వినూత్న, సబ్‌ రిస్ట్రార్‌ కె.కమలప్రియ తెలిపారు. అనంతరం పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ విలియం కేరి మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం, లీగల్‌ సర్వీసులు ప్రజలకు చేరువ కావడంలో పారాలీగల్‌ వాలంటీర్ల పాత్రను వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్‌, పంచాయతీ, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు, డ్వాక్రా మహిళలు, పారా లీగల్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:05 AM