Share News

ఏపీలోనూ అధికారం సాధించడమే లక్ష్యం

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:19 PM

పిఠాపురం, జనవరి 18: కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం సాధించాలనే లక్ష్య ంతో బీజేపీ అడుగులు వేస్తున్నదని కేంద్ర శిశు సంక్షేమశాఖ, ఆయుష్‌ మంత్రి మహేంద్ర ముంజుపార తెలిపారు. పిఠాపురంలోని మంగాయామ్మరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ నియోజకవర్గ కార్యాల

ఏపీలోనూ అధికారం సాధించడమే లక్ష్యం
శంఖవరం మండలం కత్తిపూడిలో గ్యాస్‌కిట్లు పంపిణీ చేస్తున్న కేంద్రమంత్రి

కేంద్ర మంత్రి మహేంద్ర ముంజుపార

పిఠాపురం, జనవరి 18: కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం సాధించాలనే లక్ష్య ంతో బీజేపీ అడుగులు వేస్తున్నదని కేంద్ర శిశు సంక్షేమశాఖ, ఆయుష్‌ మంత్రి మహేంద్ర ముంజుపార తెలిపారు. పిఠాపురంలోని మంగాయామ్మరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆయన గు రువారం ప్రారంభించి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని సూచించారు. మోదీ తీసుకున్న పలు చర్యలతో ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి విస్తరించిందని తెలిపారు. బీజేపీలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామకుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ బుర్రా కృష్ణంరాజు, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యనారాయణ, బుర్రి మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్‌కిట్ల పంపిణీ

శంఖవరం: మోదీ ప్రభుత్వంలో దేశంలో పే దలందరికీ పూర్తిస్థాయిలో సంక్షేమం అందుతుందని కేంద్రమంత్రి మహేంద్ర మంజూపార అన్నా రు. వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో భాగంగా కత్తిపూడిలో ఆయన పేదలకు ఉచిత గ్యాస్‌కిట్ల ను పంపిణీ చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా పేదలకు విద్యా,వైద్యం మరింత అభివృద్ధి చెందిందన్నారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ గంటా బాలుదొర, వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా అ ధ్యక్షుడు చిలుకరి రామ్‌కుమార్‌, సింగిల్‌దేవి సత్తిరాజు, అదట్రా వెంకన్నదొర, ఎంపీపీ పర్వత రాజబాబు, సర్పంచ్‌ కొల్లు సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:19 PM