Share News

ప్రాణాలతో పోరాడి ఖైదీ మృతి

ABN , Publish Date - May 29 , 2024 | 12:25 AM

సుమారు 30గంటలు ప్రాణాలతో పోరాడిన ఓ ఖైదీ చివరికి మృతిచెందాడు. లంకా చింతారావు(45) అనే ఖైదీ చెట్టు కొమ్మలు కొడుతుండగా జారి ఫుట్‌పాత్‌పై పడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

ప్రాణాలతో పోరాడి ఖైదీ మృతి

రాజమహేంద్రవరం, మే 28(ఆంధ్రజ్యోతి): సుమారు 30గంటలు ప్రాణాలతో పోరాడిన ఓ ఖైదీ చివరికి మృతిచెందాడు. లంకా చింతారావు(45) అనే ఖైదీ చెట్టు కొమ్మలు కొడుతుండగా జారి ఫుట్‌పాత్‌పై పడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అతడికి నగ రంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చింతారావు ఆరోగ్య పరిస్థితి విషమించడంపై ‘పాపం ఎవరిది’ అనే శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం సాయంత్రం తర్వాత చింతారావు ప్రాణాలు విడిచాడని జైలు అధికారులు చెప్పారు. హడావుడిగా పోస్టుమార్టం తదితర ప్రక్రియ మంగళ వారం ముగించి మృతదేహాన్ని సంబంధీకులకు అప్ప గించారు. కాగా.. ఏలూరు సమీపంలోని సూర్య వానిపేటకు చెందిన చింతారావు అలియాస్‌ రవి ఓ హత్య కేసులో శిక్షపడి ఐదేళ్ల క్రితం సెంట్రల్‌ జైలుకు వచ్చాడు. అతడికి భార్య ఉన్నారు. రవి ప్రవర్తనతో సంతృప్తి చెందిన జైలు అధికారులు ఓపెన్‌ ఎయిర్‌ జైలులో వేశారు. సెంట్రల్‌ జైలు ఎదురుగా నిర్మాణంలో ఉన్న రెస్టారెంట్‌ ఓ ప్రైవేటు కాంట్రాక్టరు ఆధ్వర్యంలో చివరి దశకు వచ్చింది. ఆ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం దగ్గర పడడంతో ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు కొమ్మలు కొట్టడానికి చింతారావును వినియోగించారు. మధ్యా హ్నం 2గంటల సమయంలో భగభగ మండే ఎండలో గొడ్డలితో చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తూ సుమారు 20 అడుగుల పైనుంచి జారి కింద సిమెంటు ఫుట్‌పాత్‌పై పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలై అప స్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విష మంగా ఉందని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభు త్వాస్పత్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. అయితే, రవిని అధికారులు నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీలో చికిత్స అందించడం గమనార్హం. మెదడులోని రక్తం గడ్డకట్టిన ప్రాంతాల్లో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. తర్వాత బీపీ బాగా పడిపోయింది. బీపీని సాధారణ స్థాయికి తీసుకురావడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి పరిస్థితి విషమించి రవి తుదిశ్వాస విడిచాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని, బాధ్యు లపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

నిర్లక్ష్యం కాదు..అనుకోకుండా జరిగింది..

పాపం ఎవరది అనే శీర్షికతో వచ్చిన కథనం సమంజసం కాదని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఓ ప్రకటనలో ఖండించారు. ఈ సంఘటన ఎవరి నిర్లక్ష్యం వల్లనో కాకుండా, కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం అని వారు తెలియజేశారు. అలాగే తాము ఖైదీల సంక్షేమం కోసమే పనిచేస్తామన్నారు. ఈ సంఘటనపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీ జరుగుతుందని ఆ నివేదికను మానవ హక్కుల కమిషన్‌కు కూడా పంపిస్తామని చెప్పారు.

Updated Date - May 29 , 2024 | 12:25 AM