Share News

‘రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన జగన్‌’

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:24 AM

గొల్లప్రోలు, ఏప్రిల్‌ 17: రాష్ట్రాన్ని జగన్‌ అప్పులో ఊబిలోకి నెట్టేశారని, ఐదేళ్లలో అప్పులను రూ.4లక్షల కోట్లు నుంచి 11లక్షల కోట్లుకు పైగా తీసుకువెళ్లారని కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఎంఎం.పళ్లంరాజు విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి అనేది ఎక్కడా లేదని వాఖ్యానించా

‘రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన జగన్‌’

గొల్లప్రోలు, ఏప్రిల్‌ 17: రాష్ట్రాన్ని జగన్‌ అప్పులో ఊబిలోకి నెట్టేశారని, ఐదేళ్లలో అప్పులను రూ.4లక్షల కోట్లు నుంచి 11లక్షల కోట్లుకు పైగా తీసుకువెళ్లారని కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఎంఎం.పళ్లంరాజు విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి అనేది ఎక్కడా లేదని వాఖ్యానించారు. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం గొల్లప్రోలులో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి మాదేపల్లి సత్యానందం (చిట్టిబాబు), నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:24 AM