Share News

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:20 AM

నూతన సంవత్సర వేడుకలను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం కొవ్వూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 31వ తేదీ రాత్రి 1గంట తర్వాత గుంపులుగా తిరగరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, రహదారులపై కేకులు కట్‌ చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం చేయరాదన్నారు.

 నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వర్మ

  • బాణసంచా కాల్చొద్దు, లౌడ్‌స్పీకర్లు వినియోగించొద్దు

  • అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు

  • కొవ్వూరు డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ

కొవ్వూరు, డిసెంబరు 31: నూతన సంవత్సర వేడుకలను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం కొవ్వూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 31వ తేదీ రాత్రి 1గంట తర్వాత గుంపులుగా తిరగరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, రహదారులపై కేకులు కట్‌ చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం చేయరాదన్నారు. నేషనల్‌ హైవే రోడ్లపై బైక్‌ రేసులు నిర్వహిస్తే కేసులు తప్పవన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు జరుపుకునే వారు ముందుగా చట్ట పరమైన అనుమతి పొందాలన్నారు. ప్రతి వేడుక వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. బాలబాలికలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. బాణసంచా కాల్చడం, లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదన్నారు. కోడి పందేలు, పేకాట, రికార్డింగ్‌ డ్యాన్స్‌, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా వ్యాప్తిని నేపథ్యంలో ప్రతిఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. మద్యం షాపులు రాత్రి 12 గంటలకు, బార్లు రాత్రి 1 గంటకు మూసివేయాలన్నారు. ఆరుబయట ముగ్గులు వేసే సమయంలో గొలుసు దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, మహిళలు విలువైన ఆభరణాలు ధరించొద్దన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరచడంలోతో కొవ్వూరు సబ్‌ డివిజన్‌కు 9 అవార్డులు వచ్చాయన్నారు. సమావేశంలో సీఐలు వి.జగదీశ్వరరావు, వైవీ రమణ, కె.వెంకటేశ్వరరావు, నున్న రాజు, ఆనసూరి శ్రీనివాసరావు, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:20 AM