Share News

రూ.9,91,820ల నగదు సీజ్‌

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:02 AM

సరైనపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.9,91, 820ల నగదు, 17 గ్రాముల బంగారు వస్తువులను కొవ్వూరు పట్టణ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు

రూ.9,91,820ల నగదు సీజ్‌
ఎటువంటి పత్రాలు లేని నగదు

కొవ్వూరు,ఫిబ్రవరి 1 : సరైనపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.9,91, 820ల నగదు, 17 గ్రాముల బంగారు వస్తువులను కొవ్వూరు పట్టణ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.కొవ్వూరు గామన్‌బ్రిడ్జి టోల్‌ గేట్‌ వద్ద బుధవారం రాత్రి కొవ్వూరు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు సిబ్బ ందితో వాహన తనిఖీలు చేపట్టారు.పలాస నుంచి శ్రీకాకుళం వెళుతున్న పత్రాప్‌ ట్రావెల్స్‌ ప్రైవేటు బస్సు డ్రైవర్‌ బాల దివాకర్‌కు శ్రీకాకుళంలో ఒక వ్యక్తి 17 గ్రాము ల బంగారు చైను, రూ. 6,41,820లు నగదు,మరొక వ్యక్తి రూ. 3,50,000ల నగదును వేర్వేరుగా పార్శిల్‌ చేసి విజయవాడలో ఇమ్మన్నారు. నగదుకు సంబంధించి పత్రాలు చూపించకపోవడంతో నగదు, బంగారు గొలు సు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సు సీజ్‌చేసి కొవ్వూరు పోలీస్టేషన్‌కు తలించారు.డ్రైవర్‌ బాల దివాకర్‌ ను తహశీల్దార్‌ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సీఐ జగదీశ్వరరావు తెలిపారు.

Updated Date - Feb 02 , 2024 | 01:02 AM