Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వివేకా హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలి

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:20 AM

వివేకా హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలి

వివేకా హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలి

రాజోలు, మార్చి 3: వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్మోహన్‌రెడ్డి పాత్రపై సీబీఐ సమగ్ర విచారణ వెంటనే జరపాలని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్‌, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బోళ్ల వెంకటరమణ డిమాండు చేశారు. రాజోలులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం వైఎస్‌ వివేకానందరెడ్డిని జగన్‌ ముఠానే హతమార్చిందని ఆరోపించారు. కర్నూలులో అవినాష్‌పే అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. వైఎస్‌ సునీతారెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జగన్‌ అండ్‌ కో సమాధానం చెప్పాలని వారు డిమాండు చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 12:20 AM