ఉమ్మడి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేద్దాం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:44 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అన్నారు.

అంబాజీపేట, ఏప్రిల్ 2: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అన్నారు. స్థానిక వెంకట్రాజు ఆయిల్‌మిల్లు వద్ద నిర్వహించిన నియోజకవర్గ ఉమ్మడి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రావులపాలెం, రామచంద్రపురంలో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలకు అధికసంఖ్యలో ఉమ్మడి పార్టీశ్రేణులు తరలిరావాలని కోరారు. పి.గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి శ్రేణులంతా తన గెలుపునకు కృషిచేయాలని కోరారు. నియోజకవర్గ కోకన్వీనర్ నామన రాంబాబు, జనసేన జిల్లాఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు, పి.గన్నవరం ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, నాయకులు దాసరి వీరవెంకట సత్యనారాయణ, గణపతి వీరరాఘవులు, దొమ్మేటి సాయికృష్ణ, మైపాల తాతాజీ, మద్దాల సుబ్బారావు, మద్దా చంటిబాబు, నాగాబత్తుల వెంకటసుబ్బారావు, గుడాల ఫణి, చిన్నం బాలవిజయరావు, పెనుమాల లక్ష్మి, అడ్డగళ్ళ శిరిజ్యోతి, అరిగెల సూరిబాబు, వక్కలంక బుల్లియ్య పాల్గొన్నారు.