Share News

కెనాల్‌ రోడ్డుకు సత్వర మరమ్మతులు చేపడతాం

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:52 AM

సామర్లకోట వేమగిరి కెనాల్‌ రోడ్డులో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు సత్వర మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే విజేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న ప్రధాన రోడ్ల స్థితిగతులపై శనివారం ఆర్‌అండ్‌బీ అధికారులతో అనపర్తి పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కెనాల్‌ రోడ్డుతోపాటు రంగంపేట-సింగంపల్లి రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.

కెనాల్‌ రోడ్డుకు సత్వర మరమ్మతులు చేపడతాం
అనపర్తిలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షిస్తున్న నల్లమిల్లి

అనపర్తి, జూన్‌ 8: సామర్లకోట వేమగిరి కెనాల్‌ రోడ్డులో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు సత్వర మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే విజేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న ప్రధాన రోడ్ల స్థితిగతులపై శనివారం ఆర్‌అండ్‌బీ అధికారులతో అనపర్తి పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కెనాల్‌ రోడ్డుతోపాటు రంగంపేట-సింగంపల్లి రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ కెనాల్‌ రోడ్డు నిర్మాణా నికి సుమారుగా రూ.600 కోట్ల నిధులు అవసరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి, ఎంపీ పురందేశ్వరి సహకారంతో రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఇదిలా ఉండగా అనపర్తి పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సర్పంచ్‌ వారా కుమారి దళిత మహిళని చిన్న చూపు చూసినా, గౌరవ మర్యాదలు ఇవ్వకున్నా ఉపేక్షించేది లేదన్నారు. సర్పంచ్‌ను తన కుర్చీలో కాకుండా వేరే గదిలో కుర్చీ వేయడం, ఆమె స్థానంలో నాయకులు కూర్చుని అజమాయిషీ చేయడం ఇక చెల్లద న్నారు. బయటి వ్యక్తుల ప్రమేయానికి కాలం చెల్లిందని ఇప్పటి వరకు పంచాయతీలో జరిగిన అక్రమాలను వెలికితీస్తామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ వారా కుమారి, నాయకులు తమలంపూడి సుధాకరరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, సత్తి దేవదానరెడ్డి, భాసి, మల్లిడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 12:52 AM