Share News

14న దివిలి కిట్స్‌లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:31 AM

పెద్దాపురం, జూన్‌ 11: మండలంలోని దివిలి కిట్స్‌ మహిళా ఫార్మసీ కళాశాలలో ఈనెల 14న క్యాంపస్‌ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు కళాశాల చైర్మన్‌ బేతినీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ గూడపాటి మధు తెలిపారు. ప్రముఖ బహుళజాతి సంస్థ ఆప్టిమస్‌ నిర్వహణలో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు

14న దివిలి కిట్స్‌లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

పెద్దాపురం, జూన్‌ 11: మండలంలోని దివిలి కిట్స్‌ మహిళా ఫార్మసీ కళాశాలలో ఈనెల 14న క్యాంపస్‌ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు కళాశాల చైర్మన్‌ బేతినీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ గూడపాటి మధు తెలిపారు. ప్రముఖ బహుళజాతి సంస్థ ఆప్టిమస్‌ నిర్వహణలో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. బీఫార్మసీ, డిగ్రీ, బీఎస్సీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ పూర్తిచేసినవారు అర్హులన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైనవారు హైదరా బాద్‌, విశాఖపట్టణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వార్షిక వేతనం రూ.2-3 లక్షల వరకూ ఉంటుందన్నారు. అవకాశాన్ని సదివనియోగం చేసుకోవాలని వారు కోరారు.

Updated Date - Jun 12 , 2024 | 12:31 AM