Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కెమెరాల కోసం యువకుడి హత్య

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:20 AM

మధురవాడలోని బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రాఫర్‌ సాయి పవన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం వద్ద హత్యకు గురవ్వడం స్థానికంగా సంచలనం రేపింది.

కెమెరాల కోసం యువకుడి హత్య

విశాఖలో అదృశ్యమై.. జొన్నాడలో శవమయ్యాడు

బక్కన్నపాలెం ఫొటోగ్రాఫర్‌ సాయి మృతదేహం లభ్యం

గోదావరి ఇసుక తిన్నెల్లో వెలికితీత

నిందితుడు మూలస్థానం వాసి

కొమ్మాది/ఆలమూరు, మార్చి 3 : మధురవాడలోని బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రాఫర్‌ సాయి పవన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం వద్ద హత్యకు గురవ్వడం స్థానికంగా సంచలనం రేపింది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బక్కన్నపాలెం గ్రామానికి చెందిన పోతిన సాయి పవన్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ ద్వారా ఫొటో షూట్‌లు చేస్తుంటాడు. తండ్రి శ్రీను ఆటోడ్రైవర్‌ కాగా తల్లి రమణమ్మ కార్‌షెడ్‌ జంక్షన్‌లో ఫ్యాన్సీషాపు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు కాగా పెద్దవాడు సాయి పవన్‌ (22) ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ఫొటోషూట్‌ చేస్తుం టాడు. ఈ విషయం తెలుసుకున్న కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారానికి చెందిన షణ్ముఖ తేజ తాను కూడా ఫొటో షూట్‌ చేస్తుంటానని, ఫోన్‌ ద్వారా సాయిని పరిచయం చేసుకున్నాడు. షణ్ముఖ తేజ, సాయి వద్ద రూ. 15 లక్షల విలువైన హైటెక్నాలజీ కెమెరాలు ఉన్నట్టు తెలుసుకున్నాడు.వాటిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశం తో సాయికి ఫోన్‌ చేసి రావులపాలెంలో పెద్ద ఈవెంట్‌ ఉందని, నీ దగ్గర ఉన్న కెమెరాలతో ఇద్దరం కలిసి ఈవెంట్‌ చేస్తే మంచి డబ్బులు వస్తాయని నమ్మ బలికాడు. దీం తో సాయి గతనెల 26న విశాఖ నుంచి రైలులో బయల్దేరి రాజమహేంద్రవరం చే రుకున్నాడు. అక్కడి నుంచి షణ్ముఖ తేజ కారును అద్దెకు తీసుకొచ్చి కడియం మండలం పొట్టిలంకకు చెందిన కారు డ్రైవర్‌ వినోద్‌తో కలిసి దారిమధ్యలో సాయి పీకను తాడుతో బిగించి హత్య చేసి జొన్నాడ వద్ద గోదావరి ఇసుక తిన్నెల్లో పాతి పెట్టారు. రూ.15 లక్షల విలువ చేసే కెమెరాలు, ఇతర సామగ్రిని పట్టుకుని పారిపోయారు. అయితే ముందుగా తనకు ఏదో ఆపద జరుగుతుందని గమనించిన సాయి కారు నెంబరును తన తల్లికి వాట్సాప్‌ చేశారు. తన నెంబరు పని చేయకపోతే వేరే నెంబరుకు ఫోన్‌ చేయమని తేజ నెంబరు పంపించాడు. తన కుమారుడు ఆపదలో ఉన్నాడనే విషయాన్ని తల్లి తెలుసుకోలేక పోయింది. ప్రతిరోజూ మాట్లాడేవాడు రెండు రోజులుగా ఫోను చేయలేదని అనుమానం వచ్చి వారి వద్ద ఉన్న సమాచారంతో గతనెల 29న పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయి పంపించిన కారు నంబరు, ఫోన్‌ నంబరు ఆధారంగా నిందితుడు మూలస్థానానికి చెందిన షణ్ముఖ తేజగా గుర్తించారు. సాయి కుంటుబ సభ్యులు పీఎం పాలెం సీఐ రామకృష్ణ సూచన మేరకు నిందితుడి ఇంటికి వెళ్లగా అప్పటికే షణ్ముఖతేజ పరారీలో ఉన్నాడు. అతని తల్లిదండ్రుల ను పోలీసులు విచారించగా సాయిని హత్య చేసి, కెమెరాలను పైనగదిలో పెట్టినట్టు చెప్పడంతో పోలీసు లు గది తాళాలు పగలకొట్టి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కెమెరాలను షణ్ముఖ తండ్రిని పీఎంపాలెం స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అమ్మాయితో చాటింగ్‌ చేయించి పట్టుకున్నారు..

నిందితుడు షణ్ముఖ తేజ మొదటి నంబరు స్విచ్ఛాప్‌లో ఉండగా రెండో నెంబరును పోలీసు లు ట్రేస్‌ చేసి అన్నవరంలో ఉన్నట్టు గుర్తించా రు. అక్కడికి వెళ్లేసరికి ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు శనివారం షణ్ముఖ తేజకు నగరంలోని కంచరపాలెంకు చెందిన అమ్మాయికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఉన్నట్టు గుర్తించి ఆ అమ్మాయిని, ఆమె తల్లిని పీఎం పాలెం స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. ఆమెతో షణ్ముఖకు ఫోన్‌లో చాటింగ్‌ చేయించారు. ఈమె మెసేజ్‌కు షణ్ముఖ స్పందించడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణ అనంతరం షణ్ముఖ ఇచ్చిన సమాచారం మేరకు సాయిని చంపి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పోలీ సులు గుర్తించారు. అనంతరం పవన్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే ఈ కేసులో కేవ లం కెమెరాల కోసమే షణ్ముఖ ఇంతకు తెగించాడా లేదా మరో కోణం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత కుటుంబీకుల రోదన

వారం రోజుల క్రితం అదృశ్యమైన కుమారుడు సాయి మృతదేహం చూసి తల్లిదండ్రులు శ్రీను, రమణమ్మ బోరున విలపించారు. తమతో ఎంతో సరదాగా ఉండే సాయిని దారుణంగా చంపేశారంటూ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

లు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:20 AM