Share News

కొండబాబు విజయం సాధించాలని అన్నవరం వరకు సైౖకిల్‌ యాత్ర

ABN , Publish Date - May 23 , 2024 | 11:26 PM

కాకినాడ సిటీ, మే 23: కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు భారీ మెజారిటీతో విజయం సాధిం చాలని కోరుతూ కాకినాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌కు చెందిన పలువురు సభ్యులు గురువారం కాకినాడ నుంచి అన్నవరం వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. స్థానిక సంజయ్‌నగర్‌ సెంటర్‌ వద్ద

కొండబాబు విజయం సాధించాలని అన్నవరం వరకు సైౖకిల్‌ యాత్ర
బయలుదేరిన లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

కాకినాడ సిటీ, మే 23: కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు భారీ మెజారిటీతో విజయం సాధిం చాలని కోరుతూ కాకినాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌కు చెందిన పలువురు సభ్యులు గురువారం కాకినాడ నుంచి అన్నవరం వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. స్థానిక సంజయ్‌నగర్‌ సెంటర్‌ వద్ద ఈ యాత్రను టీడీపీ నాయకు లు తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ జెండా ఊపి ప్రారం భించారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పెదిరెడ్ల నా నాజీ, వెలుగుల శ్రీనివాస్‌, ముదునూరి సతీష్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ సిటీలో కొండబాబును గెలిపించుకోవడానికి తామంతా సాయశక్తులా కృషి చే శామ న్నారు. కొండబాబు నామినేషన్‌ వేసినప్పుడే ఆయనను గెలి పించమని అన్నవరం సత్యనారాయణస్వామికి మొక్కుకు న్నామన్నారు. ఇంకా లెక్కింపు అవ్వకుండానే కొండబాబు విజయానికి చిహ్నంగా తామంతా అన్నవరం సైకిల్‌ యాత్ర గా వెళ్లి మొక్కు తీర్చుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు అల్లం రాజు, ఎలిపే శ్రీనివాస్‌, అర గండ్ల గంగబాబు, దుర్గాప్రసాద్‌, పినపోతుల రవి, ప్రవీ ణ్‌కిషోర్‌, పోలవరం శివ, యలమంచలి సత్తిబాబు, పార్టీ నాయకులు బాసి రమణ, పలివెల బాబ్జి, నిద్రబింగి సత్తిబా బు, ఎస్‌కె జిలాని, బాష, అన్నవరం, దొర తదితరులున్నారు.

Updated Date - May 23 , 2024 | 11:26 PM