Share News

భువిపై హరివిల్లు!

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:48 AM

ప్రతి ఏటా మహిళలను ప్రోత్సహిస్తూ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం ద్వారా మంచి సంప్రదాయాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కొనసాగించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

భువిపై హరివిల్లు!
రాజమహేంద్రవరంలో జరిగిన ముగ్గుల పోటీలో మొదటి బహుమతి కింద రూ.6 వేల నగదును విజేత డి నాగజ్యోతికి అందజేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్‌.. (కింద) మొదటి బహుమతి పొందిన ముగ్గు

రాజమహేంద్రవరంలో ఆకట్టుకున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీ

షిరిడిసాయి జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో ముందే వచ్చిన సంక్రాంతి

మంచి సంప్రదాయాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కొనసాగిస్తోందన్న వక్తలు

వారి స్ఫూర్తితోనే రాజమహేంద్రవరంలో పోటీలు నిర్వహిస్తున్నాం..

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల సభలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌

విజేతలకు నగదు, కన్సొలేషన్‌ బహుమతులు అందజేత

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 6: ప్రతి ఏటా మహిళలను ప్రోత్సహిస్తూ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం ద్వారా మంచి సంప్రదాయాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కొనసాగించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డు సమీపంలోని షిరిడిసాయి జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’’ శనివారం వైభవంగా జరిగాయి. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలకు లోకల్‌ స్పాన్సరర్‌గా ఆదిరెడ్డి భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవహరించింది. ఈ పోటీలను షిరిడిసాయి విద్యాసంస్థల డైరెక్టర్‌ టి.శ్రీవిద్య ప్రారంభించగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అభినందనలు తెలియజేశారు. అఽధిక సంఖ్యలో మహిళలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా లయన్స్‌ క్లబ్‌ పాస్ట్‌ గవర్నర్‌ మాటూరి మంగతాయారు, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, అల యన్‌ క్లబ్‌ ప్రతినిధి, తెలుగు మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొయ్యన కుమారిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన బహమతి ప్రదానోత్సవ సభకు ఆంధ్ర జ్యోతి ఎడిషన్‌ ఇన్‌చార్జి బీహెచ్‌వీ మంగేష్‌ అధ్యక్షత వహించగా భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు, టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్‌, రాజమహేంద్రవరం తొలి మహిళా మేయర్‌ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజర్‌ ఎస్‌ శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాను ఈ ఏడాది రాజమహేంద్రవరంలో 40 డివిజన్లకుపైగా సుమారు రూ.8 లక్షల వ్యయంతో మహిళలను ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు నిర్వహించడానికి ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలే స్పూర్తి అని అన్నారు. ఆదిరెడ్డి వీరాఘవమ్మ మాట్లాడుతూ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రతిరోజూ ఇంటి వాకిలి శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకునే సందర్భాలను గుర్తుచేశారు. మంచి సంప్రదాయాలను గుర్తుచేస్తున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని అభినందించారు. షిరిడిసాయి విద్యా సంస్థల డైరెక్టర్‌ టీ శ్రీవిద్య మాట్లాడుతూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి టీమ్‌ ఎంతో శ్రద్ధతో ఈ ముత్యాల ముగ్గుల పోటీలను విజయవంతంగా నిర్వహించారన్నారు. తమ విద్యాసంస్థల ప్రాంగణంలో సంక్రాంతి పండుగను వారం ముందుగానే తీసుకువచ్చారని చెప్పారు. ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ ఎస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి ఏటా ఈ ముగ్గుల పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నామని ఆయన చెప్పారు. ముగ్గుల పోటీల న్యాయనిర్ణేత మాటూరి మంగతాయారు మాట్లాడుతూ మహిళలను ముగ్గుల పోటీల ద్వారా ఉత్సాహపరుస్తున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని అభినందించారు. అనంతరం ముఖ్యఅతిఽథుల చేతుల మీదుగా ప్రథమ బహుమతి విజేత రాజమహేంద్రవరానికి చెందిన డి నాగజ్యోతికి రూ.6 వేలు, ద్వితీయ బహుమతి విజేత ధవళేశ్వరానికి చెందిన కె.లక్ష్మికి రూ.4 వేలు, మూడో బహుమతి విజేత టి.ఆదిశ్రీకి రూ.3 వేల నగదు బహుమతులు అందజేశారు. అలాగే కన్సొలేషన్‌ బహుమతులు మరో 12 మంది మహిళలకు అందజేయగా, పాల్గొన్న అందరికీ గిఫ్ట్‌లను అందించారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి జిల్లా ఇన్‌చార్జి ఎన్‌ఎన్‌ఎన్‌ సత్యనారాయణ, ఏబీఎన్‌ జిల్లా ఇన్‌చార్జి కె రాజబాబు, సర్క్యులేషన్‌ జిల్లా మేనేజరు గోపాలకృష్ణ, యాడ్స్‌ జిల్లా మేనేజర్‌ కృష్ణారావు, సబ్‌ ఎడిటర్‌ కిరణ్‌, ఆంధ్రజ్యోతి పాత్రికేయులు ఎంబీవీ సారఽథి, రామచంద్రరావు, కె శ్రీకాంత్‌, బెజవాడ శంకర్‌, ఏబీఎన్‌ కెమెరామన్‌ ఎం సతీష్‌, ఫొటోగ్రాఫర్‌ రాంబాబు, త్రీజీ కిట్‌ చందు, యాడ్స్‌ సిబ్బంది బి సుబ్రహ్మణ్యం, రవీంద్ర, కిరణ్‌కుమార్‌, విజయేంద్రనాథ్‌, సర్క్యులేషన్‌ రాజమహేంద్రవరం ఇన్‌చార్జి బాషా, ఎస్‌ఆర్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చాలా ఆనందంగా ఉంది

ఏబీఎన్‌ ఆంరఽధజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల్లో నాకు ప్రఽథమ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి యేడాది ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తోంది. మహిళలకు సంప్రదాయాల పట్ల మక్కువను పెంచుతోంది. ఈ ఏడాది పోటీల్లో నేను ప్రథమ బహుమతి సాధించడం పండుగ గిఫ్ట్‌గా భావిస్తున్నాను. ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు.

- డి. నాగజ్యోతి, రాజమహేంద్రవరం

ప్రథమ బహుమతి విజేత

బహుమతి రావడం సంతృప్తినిచ్చింది

ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల్లో ప్రతి యేడాది పాల్గొంటున్నాను. ఈ ఏడాది పోటీల్లో ద్వితీయ స్థానం రావడం సంతృప్తినిచ్చింది. చుక్కల ముగ్గులకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రయార్టీ ప్రకారం ఆఖరిగా అలంకరణను పరిగణంలోకి తీసుకోవడం బాగుంది. క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం పోటీలు నిర్వహించడం బాగుంది.

- కె. లక్ష్మి, ధవళేశ్వరం

ద్వితీయ బహుమతి విజేత

Updated Date - Jan 07 , 2024 | 01:48 AM