Share News

రేపు బ్రహ్మసమేధ్యం తీర్థం

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:35 AM

కాట్రేనికోన మండలం పల్లం గ్రామ శివారు సముద్రతీరాన బ్రహ్మసమేధ్యం ఉంది. ప్రతి ఏటా చొల్లంగి అమావాస్య రోజున ఇక్కడ తీర్థం జరుగుతుంది. చొల్లంగి రోజున సముద్ర స్నానాల కోసం జిల్లా వ్యాప్తంగా పలువురు ఇక్కడికి తరలి రావడం ఆనవాయితీ.

రేపు బ్రహ్మసమేధ్యం తీర్థం

కాట్రేనికోన, ఫిబ్రవరి 6: కాట్రేనికోన మండలం పల్లం గ్రామ శివారు సముద్రతీరాన బ్రహ్మసమేధ్యం ఉంది. ప్రతి ఏటా చొల్లంగి అమావాస్య రోజున ఇక్కడ తీర్థం జరుగుతుంది. చొల్లంగి రోజున సముద్ర స్నానాల కోసం జిల్లా వ్యాప్తంగా పలువురు ఇక్కడికి తరలి రావడం ఆనవాయితీ. ఈ నెల 8న బ్రహ్మసమేధ్యంలో చొల్లంగి తీర్ధానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు తెల్లవారుజామున సముద్ర గర్భం నుంచి వచ్చే సూర్యోదయాన్ని తిలకించేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. సూర్యోదయ సుందర దృశ్యాన్ని వీక్షించిన అనంతరం సముద్రంలో స్నానమాచరిస్తారు. బ్రహ్మసమేథ్యంలో కాలభైరవస్వామి కొలువుతీరి ఉన్నాడు. ఈ ప్రదేశంలో ఆయన పాద ముద్రలు పురాణాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీటిలో శంఖుచక్రాలు, వింజామరలు నేటికీ కనిపించడం ఈ క్షేత్ర ప్రసిద్ధికి తార్కాణం. చొల్లంగి అమావాస్య రోజున ఈ ఆలయ ఆవరణలో సంతానం లేని స్త్రీలు స్వామిని ఆరాధించి నిద్రిస్తే కలిగే స్వప్నంలో అరటి పండ్లు, కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు కన్పిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. అమలాపురం డీఎస్పీ మహేశ్వరరావు ఆధ్వర్యంలో ముమ్మిడివరం సీఐ కొండయ్య, ఎస్‌ఐ నాగేశ్వరరావు తీర్థంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 07 , 2024 | 12:35 AM