Share News

పాఠశాలల పునఃప్రారంభానికి పుస్తకాలు అందజేత

ABN , Publish Date - May 30 , 2024 | 12:46 AM

జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రతి విద్యార్థికి విద్యాకానుక పుస్తకాలు అంద జేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని డిప్యూటీ కలెక్టర్‌, సమగ్రశిక్షా ప్రాజెక్టు అదనపు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు తెలిపారు.

పాఠశాలల పునఃప్రారంభానికి పుస్తకాలు అందజేత

రాయవరం, మే 29: జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రతి విద్యార్థికి విద్యాకానుక పుస్తకాలు అంద జేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని డిప్యూటీ కలెక్టర్‌, సమగ్రశిక్షా ప్రాజెక్టు అదనపు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు తెలిపారు. బుధవారం రాయవరం శ్రీరామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యాకానుక స్టాక్‌ పాయింట్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22మండలాల్లో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటుచేశామని, స్టాక్‌ను సక్రమంగా పాఠశాలలకు చేరవేసేందుకు మండల స్థాయిలో ప్రతీ కాంపొనెంట్‌కు ఒక కమిటీని నియమించామన్నారు. పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదల చేశామన్నారు. జిల్లాలోని స్టాక్‌ పాయింట్లకు 6.62లక్షల నోట్‌ పుస్తకాలు, 66,549 బెల్ట్‌లు చేరుకున్నాయన్నారు. జూన్‌ 5న నాటికి విద్యాకానుక మెటీరియల్‌ స్టాక్‌ పాయింట్లకు చేరుకుంటుదన్నారు. అనంతరం మండల పరిషత్‌ సమావేశపు హాల్‌లో మనబడి-నాడు నేడు పనులపై వివిధ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట సమగ్రశిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏఎంవో పి.రాంబాబు, సైట్‌ ఇంజనీరు సూర్యనారాయణ, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, వై.సూర్యనారాయణ, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:46 AM