Share News

రూ.500 కోసం బ్లేడ్‌తో బెదిరింపు

ABN , Publish Date - May 25 , 2024 | 12:16 AM

ఓ యువకుడిపై దౌర్జన్యం చేసి సెల్‌ఫోన్‌ లాక్కున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలిం చారు.

రూ.500 కోసం బ్లేడ్‌తో బెదిరింపు

బాధితుడి ఫిర్యాదు.. నిందితుడి అరెస్టు

రాజమహేంద్రవరం, మే 24(ఆంధ్రజ్యోతి): ఓ యువకుడిపై దౌర్జన్యం చేసి సెల్‌ఫోన్‌ లాక్కున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలిం చారు. ఈ నెల 21న రాత్రి 10 గంటల సమయంలో ధవళేశ్వరం ఇందిరా కాలనీకి చెందిన ఓ యువకుడు కంచరలైన్‌ శ్రీ మరిడి మహాలక్ష్మీ ఆలయం వద్ద ఉండగా అదే ప్రాంతానికి చెందిన రంగాల దుర్గాసాయి(పులి) ఆ యువకుడి వద్దకు వెళ్లి రూ.500 ఇవ్వాలని బెదిరించాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పి.. అయినా నీకెందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు. దీంతో దుర్గాసాయి బ్లేడు చూపించి చంపేస్తానని బెదిరించి సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో ధవళేశ్వరం పీఎస్‌ ఎస్‌ఐ బి.హరిబాబు కేసు నమోదు చేసి సీఐ వి.వినయ్‌ మోహన్‌ నేతృత్వంలో డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్‌ స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం దుర్గాసాయిని అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన ఫోల్డింగ్‌ బ్లేడు, దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ అంబికా ప్రసాద్‌ పేర్కొన్నారు. కోర్డు ఆదేశాలతో రిమాండుకు తరలించామన్నారు. నిందితుడిని ఇప్పటికే మూడు కేసుల్లో అరెస్టు చేసి జైలుకు తరలించగా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడన్నారు. దుర్గాసాయిపై సస్పెక్ట్‌ షీట్‌ ఉందని, ఇప్పుడు రౌడీషీట్‌ తెరుస్తామని డీఎస్పీ చెప్పారు.

Updated Date - May 25 , 2024 | 12:16 AM