Share News

కాయ్‌ రాజా కాయ్‌!

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:01 AM

ఎన్నికల నోటిఫికేషన్‌ దారిలో ఉంది. ఏ క్షణంలోనైనా ఉరుముతుంది. దీంతో అభ్యర్థులు, ఆశావహులు ‘లెక్క’లు వేసుకోవడంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రావీణ్యానికి పదును పెడుతున్నారు.

 కాయ్‌ రాజా కాయ్‌!

ఎవరి ‘లెక్క’ వారిది

వేడెక్కుతున్న రాజకీయం

జిల్లాలో బెట్టింగ్‌ల జోరు

నిన్నటి వరకూ అభ్యర్థి ఎవరని?

నేడు గెలుపు ఎవరిదని?

మిగిలిన సీట్లపై పందేలు

చేతులు మారుతున్న రూ.కోట్లు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల నోటిఫికేషన్‌ దారిలో ఉంది. ఏ క్షణంలోనైనా ఉరుముతుంది. దీంతో అభ్యర్థులు, ఆశావహులు ‘లెక్క’లు వేసుకోవడంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రావీణ్యానికి పదును పెడుతున్నారు. సీటు నాదని ఒకరు.. బరిలో నేనే అని మరొకరు.. మా పార్టీదే అధికార పీఠమని ఇంకొకరు. ఇలా దూసుకుపోతుండగా.. ప్రజల్లో కూడా చర్చ జోరందుకుంది. ఇది ఓటుకు ఓ వైపు.. మరోవైపు ‘కాసులు’ కాలు దువ్వడం మొదలైపోయింది. నగదు, నగలు, వాహ నాలు, ఆస్తులు.. ఇలా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. రాష్ట్ర మంతా ఓ ఎత్తు అయితే ముందు నుంచీ తూర్పుగోదావరి జిల్లా తీరు సెప‘రేటు’గా నడుస్తోంది. దీంతో పందేలూ పరు గులు పెడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంలోనూ తూర్పులో తీవ్ర ఉత్కంఠ నడుస్తూనే ఉంది. అది బెట్టింగ్‌లకు ఊతమిచ్చింది. నిన్నమొ న్నటి వరకూ అభ్యర్థి ఎవరు? ఇన్‌చార్జిగా ఎవరిని నియమి స్తారు? వారికే సీటు దక్కుతుందా? అనే అంశాలను బెట్టింగ్‌ లకు ప్రమాణాలుగా తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో క్రీడ రసవత్తరంగా మారింది. ఇప్పటికే అభ్యర్థిత్వాలపై సాగుతున్న బెట్టింగ్‌లు గెలుపుపైకి మారింది. టీడీపీ ప్రకటించిన జాబితాలో జిల్లాలోని కీలక స్థానమైన రాజమహేంద్రవరం సిటీకి టీడీపీ అభ్యర్థిని ప్రక టించడం, ఇప్పటికే వైసీపీ నుంచి భరత్‌రామ్‌ బరిలో ఉం డడంతో బెట్టింగ్‌లు కోట్లకు చేరి దూసుకుపోతున్నాయి. గెలుపు మాదేనంటే మాదేనంటూ పందేలు కాస్తున్నారు. ఎవరి ‘లెక్క’లు వాళ్లేసుకుని బెట్టింగ్‌ కడుతున్నారు. టీడీపీ సైకిల్‌ జోరు మీదుండడం, జనసేనతో సాఫీగా పయనం సాగుతుండడం.. రెండూ కలిసి కచ్చితంగా అధికారంలోకి వస్తాయని బలంగా వినిపిస్తుండడంతో ఇప్పటి వరకూ టీడీపీ అభ్యర్థులపై ఆసక్తి బాగా ఎక్కువైంది.కొందరు టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనతో పార్టీలతో సంబంధం లేని ప్రజానీకం కూడా పందేల్లో ఎంతో కొంత వాటా పెడుతు న్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని గోదావరికి పశ్చిమంవైపు ఉన్న ఓ నియోజకవర్గంలో సీటుపై బెట్టింగ్‌లు లక్షల్లో జరుగుతు న్నాయి.ఈ నియోజకవర్గానికి టీడీపీ -జనసేన, వైసీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. టీడీపీ శనివా రం అభ్యర్థులను ప్రకటించడంతో మిగిలిన 4 నియోజకవ ర్గాల్లో అభ్యర్థులు ఎవరనే విష యంపై తీవ్రంగా చర్చ సాగింది. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రూరల్‌ సీటుపై ఇంకా డైలమా కొనసాగుతూనే ఉంది. ఇరుపార్టీల అధినేతలు ఇరువురు అభ్యర్థులకు సీటు మీదేనంటూ హామీ ఇవ్వడంతో ఈ సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే శనివారం ఈ సీటుపై కూడా స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలిసినా ఇంకా రకరకాల ప్రచారం సాగుతూనే ఉంది. దీంతో మరింత ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇంకా బెట్టింగ్‌ సాగుతూనే ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌ సీటు వ్యవహారం నిడదవోలును తాకడంతో అక్కడా ఇదే పరిస్థితి. వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జిలపై మరో విధంగా బెట్టిం గ్‌లు సాగుతున్నాయి. వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఇన్‌చార్జిలుగా నియ మించిన వారికి సీటు ఉంటుందా లేదా అనే దానిపై బెట్టిం గ్‌లు జోరుగు సాగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఎవరికి వస్తాయనే దానిపై కూడా బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. బెట్టింగ్‌ వ్యవహారమంతా స్మార్ట ఫోన్ల లోనే నడిచిపోతోందని చెబుతున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 01:01 AM