Share News

సముద్రతీరం.. జాలర్ల జీవితం అల్లకల్లోలం

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:40 AM

సముద్రతీరంలో జరుగుతున్న కల్లోలం కూడా ఎంతో నష్టాన్ని కలుగజేస్తోంది. ఇప్పటికే సము ద్రతీరంలో కోత మత్స్యకారుల ఊళ్లను మింగే స్తోంది. కాకినాడ జిల్లాలో తొండంగి తీరం నుంచి కాకినాడ వరకు మొత్తం 144 కిలోమీటర్ల మేర సముద్రం విస్తరించి ఉంది.

సముద్రతీరం.. జాలర్ల జీవితం అల్లకల్లోలం

(కాకినాడ/అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సముద్రతీరంలో జరుగుతున్న కల్లోలం కూడా ఎంతో నష్టాన్ని కలుగజేస్తోంది. ఇప్పటికే సము ద్రతీరంలో కోత మత్స్యకారుల ఊళ్లను మింగే స్తోంది. కాకినాడ జిల్లాలో తొండంగి తీరం నుంచి కాకినాడ వరకు మొత్తం 144 కిలోమీటర్ల మేర సముద్రం విస్తరించి ఉంది. బంగాళాఖాతంలో చిన్న అల్పపీడనం ఏర్పడితేచాలు.. ఎక్కడా లేనం తగా తీరం ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ముఖ్యం గా ఉప్పాడలో అయితే సముద్రం అల్లకల్లోలంగా మారి మత్స్యకారుల ఇళ్లను ముంచేస్తోంది. ఉప్పాడ బీచ్‌ రోడ్డును ఛిద్రం చేసేస్తోంది. ఆ సమయంలో మత్స్యకార కుటుంబాలు బిక్కు బిక్కుమని గడుపుతాయి. ఇప్పటివరకు వాతా వరణ మార్పులు, తుఫాన్ల వల్ల ఉప్పాడ వద్ద సముద్రం గడచిన రెండు దశాబ్దాల్లో 1,360 ఎకరాలను మింగేసి ముందుకొచ్చేసింది. దాదాపు పాతకసార్లు ఉప్పాడ బీచ్‌ రోడ్డును ఛిద్రం చేసే సింది. ఇప్పటివరకు ఈ రహదారి మరమ్మతుల కు రూ.35 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిం దంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే జిల్లాలో సముద్రతీరం వెంబడి 24,500 మంది మత్స్యకారులు సముద్రంపై వేట సాగి స్తూ జీవనాధారం పొందుతున్నారు. పొద్దున లేస్తే సాగరమాత ఒడిలోనే వీరంతా బతుకుతా రు. బోట్లు వేసుకుని రోజుల తరబడి వేట సాగిస్తూ ఉపాధి పొందుతారు. సముద్రంలో వేట లేదంటే పూట తిండికీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు. అయితే జూన్‌ నుంచి అక్టోబరు మధ్య తరచూ వచ్చే తుఫాన్లు, భారీ వర్షాలతో మత్స్యకారులు రోజుల తరబడి వేట సాగించ డానికి వీల్లేని పరిస్థితి. మత్స్యశాఖ హెచ్చరికలతో బోట్లు కట్టేసి ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్థితి. ఇలా ఏడాదిలో సముద్రంలో వేట నిషేధ సమ యం కాకుండా కనీసం అంతా కలిపితే నలభై రోజుల వరకు పలు దఫాలుగా వేట అర్ధాంత రంగా ముగించుకుని ఒడ్డుకు రావలసిన పరి స్థితి. ఇలా జరిగే ప్రతి సమయంలో వందల లీటర్ల డీజిల్‌ వృథా ఖర్చుకింద మారుతూ మత్స్యకారులు నష్టపోతున్నారు. ఈ సమ యంలో వీరిని ఆదుకునే పథకాలేవీ లేకపోవ డంతో వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడా అని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూడాల్సిన పరి స్థితి. ఈ ఏడాది అయితే వర్షాలు జిల్లాపై పగబట్టినట్టు అదేపనిగా పడుతూనే ఉన్నాయి. అటు యానాంలోనూ ఇదే పరిస్థితి. ఇక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో బంగాళాఖాతం సముద్ర తీరం ప్రాంతం 40 కిలోమీటర్ల మేర ఉంది. ఈ తీరం వెంబడి అలల తీవ్రత పెరుగుతుండడంతో తీరం భారీగా కోతకు గురై తీర ప్రాం త ప్రజలను కలవరపెడుతోంది. ముఖ్యంగా అంతర్వేది, కరవాక, అల్లవరం మండలం ఓడ లరేవు ప్రాంతాల్లో ఆస్తుల విధ్వంసం భారీగా ఉంది. అంతర్వేది బీచ్‌లో ఉండే తాత్కాలిక హోటల్స్‌, దుకాణాలు, రిసార్ట్స్‌ వంటివి కూడా ముంపునకు గురవుతున్నాయి. అల్లవరం మం డలం ఓడలరేవులోని సముద్ర తీరంలో ఉన్న ఓఎన్జీసీ ప్లాంటు ప్రహారీ గోడ ఇప్పటికే ధ్వంసమైంది. గతంకంటే భిన్నంగా తీర ప్రాంతంలో అలల తీవ్రత ఆందోళనకరంగా ఉంది. మత్స్య కారుల జీవనంపై తీవ్ర ప్రభావం పడింది.

Updated Date - Oct 20 , 2024 | 01:40 AM