ఎస్.యానాం బీచ్‌లో శాశ్వత విద్యుద్దీకరణ
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:45 AM
ఎస్.యానాం బీచ్‌లో శాశ్వత విద్యుద్దీకరణకు చర్యలు తీసుకున్నట్టు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెప్పారు.

ఉప్పలగుప్తం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎస్.యానాం బీచ్‌లో శాశ్వత విద్యుద్దీకరణకు చర్యలు తీసుకున్నట్టు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెప్పారు. దీనికోసం బీచ్‌లో 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల27 నుంచి 29వరకు జరగనున్న జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీల నిమిత్తం బీచ్‌లో పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాలీబాల్ పోటీల నిర్వహణకు జరుగుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం కల్పనపై ఆయన ట్రాన్స్‌కో ఏఈ శ్రీహరికి పలు సూచనలు చేశారు. క్రీడా ప్రాంగణం సంసిద్ధతపై పీడీ గొలకోటి ఫణీంద్రకుమార్ ఎమ్మెల్యేకు వివరించారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు ఈనెల 23న ప్రారంభిస్తామని ట్రాన్స్‌కో ఏఈ తెలిపారు. వాలీబాల్ పోటీల ఏర్పాట్లపై వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పలచోళ్ల పద్మనాభంతో ఆయన చర్చించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వాసా దివాకర్, ఎంపీడీవో రాజ్‌కుమార్, మండల ఇంజనీరింగ్ అధికారి వి.రాధాకృష్ణ, వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లంకే భీమరాజు, సంయుక్త కార్యదర్శి అయితాబత్తుల అజయ్‌సింగ్, అముడా చైర్మన్ అల్లాడి స్వామినాయుడు, నీటి పంపిణీ సంఘం చైర్మన్ దంగేటి చిట్టిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, కూటమి నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, సత్తి చిన్నా, ఆకేటి పెద్ద, రవణం మధు, అయితాబత్తుల రాజశేఖర్, అడపా అవినాష్, దెందుకూరి సత్తిబాబురాజు, దాట్ల గోపీరాజు, యాళ్ల సత్తిబాబు, పంచాయతీ కార్యదర్శి పల్లి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.