Share News

రాష్ర్టానికి ఏం చేశావని ఓటెయ్యాలి!

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:25 AM

అసలు రాష్ట్రానికి ఏమి చేశావు జగన్‌? ఓ పోలవరం చేశావా ? ప్రత్యేకహోదా తెచ్చావా ? పరిశ్రమలు తెచ్చావా ? నిరుద్యోగ సమస్య తీర్చావా ? ఏమి చేశావని నీకు ఓటెయ్యాలో చెప్పు అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

రాష్ర్టానికి ఏం చేశావని ఓటెయ్యాలి!
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి తెలుగు మహిళల పూలమాల

కూటమిని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్‌

ఆలోచించి ఓటెయ్యాలని పిలుపు

జయహో బీసీ సభ విజయవంతం

రాజమహేంద్రవరంసిటీ/రూరల్‌/కడియం మార్చి 15 : అసలు రాష్ట్రానికి ఏమి చేశావు జగన్‌? ఓ పోలవరం చేశావా ? ప్రత్యేకహోదా తెచ్చావా ? పరిశ్రమలు తెచ్చావా ? నిరుద్యోగ సమస్య తీర్చావా ? ఏమి చేశావని నీకు ఓటెయ్యాలో చెప్పు అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుకుంపేటలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. మరో మూడు నెలల్లో జగన్‌ జైలుకెళ్లడం ఖాయం అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు గోరంట్ల, నేను పార్టీ కోసం పనిచేస్తాం.మేము చచ్చే వరకు పార్టీని కాపాడుకుంటాం..చచ్చాక కూడా పార్టీ జండా కప్పుకుంటాం అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పెన్షన్‌ పథకాన్ని అన్న ఎన్టీఆర్‌ పెడితే దానిని పెంచింది చంద్రబాబు అన్నా రు. స్థానిక సంస్థల్లో బీసీల వాటా 24 శాతం ఎన్టీఆర్‌ పెడితే దానిని 34 శాతానికి చంద్రబాబు పెంచారని చెప్పారు. ఇపుడు జగన్‌ దానిని 24 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రంలో బీసీ వర్గాలకు చెందాల్సిన 16 వేల పదవులు పోయాయన్నారు. చేతి వృత్తులకు ఆదరణ కరువైందన్నారు. రాష్ట్రంలో 279 మంది బీసీలు ఈ నాలుగేళ్ల 11 నెలల కాలంలో హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చే శారు. అందుకే బీసీ రక్షణ చట్టాన్ని తెస్తున్నట్టు తెలిపారు. రూరల్‌ నియోజకవర్గం విషయానికి వస్తే ఒక చోట పనిచేయని అవినీతి మంత్రిని అక్కడ ప్రజలు తిరస్కరిస్తే రూరల్‌కు పంపించారని, అక్కడ గుళ్ళు , గోపురాలు, కాలవగట్లు, అన్ని ఖాళీ చేసిన అమాత్యులు ఇక్కడ దోపిడీకి వచ్చారన్నారు. ఆలీబాబా 40 దొంగల్లాగా ముఠాలుగా ఒకరే ఈ మంత్రి అని ఆరోపించారు. ఈయన పాత్రలు, చీరలు పంపిణీ చేసి ఓట ర్ల ప్రలోభానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ భరత్‌రామ్‌ పనికిరాని భూములను కొనుగోలు చేయించి మరో చోట భూములకు బోగస్‌ పట్టాలు తయారు చేసి మభ్యపెడుతున్నాడని అవి ఎందుకు పనికిరావన్నారు. దగా పడ్డ ప్రజలు ఆలోచించుకుని దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని..బీసీలంతా ఏకమై కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్‌నేత వినుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతి కి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. బీసీల అభ్యున్నతి తెలుగుదేశంతోనే సాధ్యం అని రూరల్‌ నుంచి పోటీ చేస్తున్న గోరంట్లను గెలిపించాలని కోరారు. నూర్‌ బాషా సాధికార సమితి కన్వీనర్‌ షేక్‌ సుభాన్‌ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమైందన్నారు. డా.వెంకటరమణ మాట్లాడుతూ బీసీ వర్గాలకు చెందిన పిల్లలు చదువుల్లో రాణించడానికి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలే కారణం అన్నారు. గోరంట్ల, అయ్యన్నపాత్రుడు ఇద్దరినీ గజమాలతో సత్కరించారు. అటుపై గోరంట్ల పుట్టిన రోజు పురస్కరించుకుని వేదికపై కార్యకర్తలు, నాయకులు సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో గోరంట్ల కుమార్తె శిరీష, టీడీపీ రాష్ట్ర నాయకులు మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి ప్రసాద్‌, అన్నందేవుల చంటి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, యర్రా వేణుగోపాలరాయుడు, వాసిరెడ్డి రాంబా బు, తెలుగు మహి ళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, మార్ని వాసు, పండూరి అప్పారావు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, పిన్నింటి ఏక బాబు, పితాని శివరామకృష్ణ, దండమూడి ప్రసాద్‌, ముత్తాబత్తుల విజయ, గుత్తుల కృష్ణ, యార్లగడ్డ శేఖర్‌, యనమదల రాజు, బత్తిన ఏడుకొండలు, ధర్మరాజు, దండమూడి ప్రమీల,జోగి చక్రవర్తి, కొయ్యనకుమారి, మత్యేటి ప్రసాద్‌, ప్రత్తిపాటి రామారావుచౌదరి, యార్లగడ్డ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - Mar 16 , 2024 | 12:25 AM