Share News

ప్రజా సేవకుడిగా ఉంటా

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:22 AM

ఒక సేవకుడిగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మె ల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిన తరువాత మొదటిసారిగా శుక్రవారం కొవ్వూరు విచ్చేసిన ఆయ నకు మెరకవీధి వినాయకుని గుడి వద్ద ద్విసభ్య కమిటీ కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో మూడు పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు.

ప్రజా సేవకుడిగా ఉంటా
సమావేశంలో మాట్లాడుతున్న ముప్పిడి వెంకటేశ్వరరావు

  • కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సైనికుల్లా పనిచేయాలి

  • కొవ్వూరు టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి

కొవ్వూరు, మార్చి 15: ఒక సేవకుడిగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మె ల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిన తరువాత మొదటిసారిగా శుక్రవారం కొవ్వూరు విచ్చేసిన ఆయ నకు మెరకవీధి వినాయకుని గుడి వద్ద ద్విసభ్య కమిటీ కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో మూడు పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. గుడి నుంచి ర్యాలీగా స్థానిక పార్టీ నియోజకవర్గ కార్యాలయానికి చేరుకుని పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పిడి మాట్లాడుతూ తాను 2014-2019లో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. 2000 సంవత్సరం నుంచి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న తనకు చంద్రబాబు మూడు సార్లు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించారన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి కష్టం తెలిసిన వ్యక్తినయిన తాను ఎప్పుడూ ఒక ఎమ్మెల్యేగా ఫీలవ్వలేదన్నారు. ఒక కార్యకర్తగా, సేవకుడిగా అందరికీ సేవ చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, పురందేశ్వరీల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఎన్నికల పూర్తయ్యేవరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త నిరంతరం కష్టపడాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ మద్దిపట్ల శివరామకృష్ణ, దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, డేగల రాము, ఆళ్ల హరిబాబు, గారపాటి శ్రీదేవి, బేతిన నారాయణ, అక్కిన రాంబా బు, మరపట్ల కళాధర్‌, వేమగిరి వెంకట్రావు, సూరపనేని చిన్ని, కంటిపూడి శ్రీనివాస్‌, నాదెళ్ల శ్రీరామ్‌, కేవీకే రంగారావు, కలగర సుబ్బారావు, కాగిత రఘు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:22 AM