ఉప్పాడలో బంగారు రజను వేట
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:48 AM
కొత్తపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల అనంతరం ఉప్పాడ తీరంలో బంగారు రజను వేట ప్రారంభమైంది. కెరటాలు సాధారణ స్థాయిలో ఒడ్డుకు రావడం, వెనక్కి వెళ్లడం జరుగుతుంది. అల్పపీడనాలతో ఉప్పొం గిన సముద్ర కెరటాలు ఒడ్డును బలంగా తాకేవి. అప్పట్లో కెరటాల

కొత్తపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల అనంతరం ఉప్పాడ తీరంలో బంగారు రజను వేట ప్రారంభమైంది. కెరటాలు సాధారణ స్థాయిలో ఒడ్డుకు రావడం, వెనక్కి వెళ్లడం జరుగుతుంది. అల్పపీడనాలతో ఉప్పొం గిన సముద్ర కెరటాలు ఒడ్డును బలంగా తాకేవి. అప్పట్లో కెరటాల వేగానికి ఒడ్డున నిలబడి ఇసుకలో బంగారు రజను సేకరించడం వీలుపడని కారణంగా గత 2 రోజుల నుంచి మత్స్యకార మహిళలు తీరంలో ఒడ్డున బంగారు రజకు కోసం జల్లెడ పట్టారు. దువ్వెనలు, పలుచని బ్లేడ్ వంటి రేకులతో సముద్రం ఒడ్డున ఇసుకపై రాయడంతో బంగారం రజను తళతళలాడుతూ కనిపిస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మత్స్యకారులు ఒడ్డునే బంగారు రజను కోసం వెతుకుతున్నారు. గత నెలరోజులుగా సముద్రంపై వేటకు వెళ్లని మత్స్యకారులకు రజను వేట కాస్త ఉపశమనం కలిగిస్తోంది.