నేడు బాలయోగీశ్వరుల తీర్థం
ABN , Publish Date - Mar 09 , 2024 | 12:16 AM
శివరాత్రి తర్వాత రోజైన శనివారం జరిగే బాలయోగీశ్వరుల తీర్థం చాలా ప్రాముఖ్యమైనది. దీక్షలో ఉండగానే 1985 జూలై 19న పెదబాలయోగీశ్వరులు, ఆ తర్వాత 1991 అక్టోబరు 28న చినబాలయోగీశ్వరులు కైవల్య సిద్ధి పొందారు.
ముమ్మిడివరం, మార్చి 8: శివరాత్రి తర్వాత రోజైన శనివారం జరిగే బాలయోగీశ్వరుల తీర్థం చాలా ప్రాముఖ్యమైనది. దీక్షలో ఉండగానే 1985 జూలై 19న పెదబాలయోగీశ్వరులు, ఆ తర్వాత 1991 అక్టోబరు 28న చినబాలయోగీశ్వరులు కైవల్య సిద్ధి పొందారు. వారిని తపో మందిరంలోనే సమాధి చేశారు. నేటికీ ఆ సమాధులను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. బాలయోగీశ్వరుల తీర్థాన్ని పురస్కరించుకుని ముమ్మిడివరంలోని బాలయోగీశ్వరుల ఆశ్రమాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా బాలయోగీశ్వరుల దివ్య సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన, రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మండపంపై బాలయోగీశ్వరుల విగ్రహ దర్శనం, సమాధుల దర్శనం ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ కమిటీ, కుటుంబ సభ్యులు వసతి, భోజనం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.