Share News

భక్తవత్సల గోవిందా!

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:51 AM

: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామి వారికి సుప్రభాతసేవ, ఐశ్వర్యలక్ష్మిహోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను, శాస్ర్తోక్తంగా నిర్వహించి స్వా మివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.

భక్తవత్సల గోవిందా!

ఫ వాడపల్లి వెంకన్న ఒక్కరోజు ఆదాయం రూ.38.36లక్షలు

ఫ స్వామివారిని దర్శించున్న ఎమ్మెల్యే విజేతలు

ఆత్రేయపురం, జూన్‌ 8: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామి వారికి సుప్రభాతసేవ, ఐశ్వర్యలక్ష్మిహోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను, శాస్ర్తోక్తంగా నిర్వహించి స్వా మివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధులలో ఏడు ప్రదక్షణలు నిర్వహించుకుని భారీ క్యూలైన్ల స్వామివారిని దర్శించుకున్నారు. తులభారాలు, కానుకలు, తలనీలాలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. భారీ క్యూలైన్ల ద్వారా గోవిందనామస్మరణతో అశేషభక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. మండపేట ఎమ్మెల్యే విజేత వేగుళ్ళ జోగేశ్వరరావు, ఉంగుటూరి ఎమ్మెల్యే విజేత పత్సమట్ల ధర్మరాజులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యో గులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదా యం రూ.38.36 లక్షలు లభించినట్టు డిప్యూటీ కమిషనర్‌, ఈవో భూపతిరాజు కిషోర్‌కుమార్‌ తెలిపారు.

శృంగారవల్లభస్వామి ఆలయానికి భక్తుల రద్దీ

పెద్దాపురం, జూన్‌ 8: కాకికాడజిల్లా పె ద్దాపురం మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారు జామునే బారులు తీరారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,99,950 అన్న దాన విరాళాలు రూ.89,619 ఆదాయం, కేశ ఖండన ద్వారా రూ.12,080, తులాభారం రూ.750, లడ్డూ ప్రసాదం ద్వారా 25,770, కానుక ద్వారా రూ.350 వెరసి రూ.4,28,519 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. దేవస్థానం అర్చకులు పెద్దింటి నారాయ ణాచార్యులు పాల్గొన్నారు.

అప్పనపల్లి వెంకన్నకు పోటెత్తిన భక్తులు

బాలబాలాజీ దేవస్థానం ఆదాయం రూ.4,18,282

మామిడికుదురు, జూన్‌ 8: అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు వైనతేయ నదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కొత్త, పాత ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శనివారం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని 4,585 మంది భక్తులు దర్శించుకున్నారని, 3,471మంది అన్నప్రసాదం స్వీకరించారని, వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.4,18,282 ఆదాయం వచ్చిందని సహాయ కమిషనర్‌ జి.మాధవి తెలిపారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏసీ, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

నిత్యాన్నదానానికి రూ.10వేలు విరాళం

బాలబాలాజీ స్వామి నిత్యాన్నదాన పథకానికి యలమంచిలి గ్రామం వైవీలంక బాడవకు చెందిన పాతబళ్ల సూర్యనారాయణ-సుధారాణి దంపతులు రూ.10వేలు విరాళాన్ని అందించారు. దాత దంపతులకు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించారు.

Updated Date - Jun 09 , 2024 | 01:51 AM