అయ్యప్ప దీక్ష..పోలీసులకు అనుమతుల్లేవ్
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:09 AM
అయ్యప్ప/భవానీ దీక్షలకు పోలీస్ సిబ్బందికి అనుమతిలేదని ఎస్పీ నరసింహ కిషోర్ ఉత్తర్వులిచ్చారు.
రాజమహేంద్రవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అయ్యప్ప/భవానీ దీక్షలకు పోలీస్ సిబ్బందికి అనుమతిలేదని ఎస్పీ నరసింహ కిషోర్ ఉత్తర్వులిచ్చారు. విధు ల్లో ఉండే పోలీసులు నిబంధనలను అను సరించి యూనిఫాం, షూ తదితర నిబం ధనలు పాటించాల్సిందేనన్నారు. అయ్యప్ప దీక్ష తీసుకునేవాళ్లు తప్పని సరిగా సెల వుకు అర్జీ పెట్టుకోవాలన్నారు. ఉత్తర్వు లను తప్పనిసరిగా అమలు చేయాల్సిందే నని డీఎస్పీలు, కొవ్వూరు ఎస్‌డీపీవో, అం దరు ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. దీక్షల కోసం అనుమతి కోరుతూ ఏ విధమైన వినతులనూ జిల్లా పోలీసు కార్యాల యా నికి పంపించవద్దని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై సిబ్బంది మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా హైందవంపై చిన్న చూపేనని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే కల్పించుకోవాలని విన్న విస్తున్నారు. జిల్లా పోలీసు సిబ్బందిలో ఇప్పటికే కొందరు అయ్యప్ప దీక్ష తీసుకు న్నారు. శబరిమల వెళ్లడానికి అనుమతి స్తారో లేదో తెలియని అగమ్యగోచరంలో వాళ్లు పడిపోయారు.మరి కొందరు మాల ధారణకు అనుమతి దొరక్క తీవ్ర మాన సిక ఆందోళన చెందుతున్నారు.దీక్ష తీసుకు న్నప్పటికీ విధుల సమయంలో యూని ఫాం, టోపీ ధరిస్తున్నామని, కేవలం షూ మాత్రమే ఉండదని, మాలాధారణ చేశా మనే సంకేతానికి మేడలో నల్ల టవల్ మాత్రం వేసుకుంటున్నామని గుర్తు చేస్తు న్నారు.కేవలం 45 రోజులపాటు మాత్రమే దీక్షకు సంబంధించిన నియమాల్లో ఉంటు న్నామన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి కార్తీక మాసం వస్తుంది.జ్యోతి దర్శనానికి శమరిమల వెళ్లే వాళ్లు ఆ తేదీల్లోనే మాల ధారణ చేస్తారు.వాళ్ల పరిస్థితీ అయోమ యంగానే ఉంది. భవానీ దీక్ష ముగిసిన తర్వాత అయ్యప్ప దీక్షా సమయంలో ఇలా ంటి ఉత్తర్వులపై విమర్శలు వస్తున్నాయి.