Share News

ఆగస్టు ఒకటి..వస్తోంది!

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:16 AM

జిల్లాలో ఎన్‌టీఆర్‌ భరోసా పిం ఛన్ల పంపిణీకి సర్వం సిద్ధంచేశారు. ఆగస్టు ఒకటో తేదీన నూరు శాతం పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు.

ఆగస్టు ఒకటి..వస్తోంది!

ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీకి సన్నాహాలు

జిల్లాలో 2,77,587 మందికి రూ.116 కోట్లు

సచివాలయ సిబ్బందితో లబ్ధిదారు ఇంటికే పింఛన్లు

కలెక్టరేట్‌ (కాకినాడ), జూలై27: జిల్లాలో ఎన్‌టీఆర్‌ భరోసా పిం ఛన్ల పంపిణీకి సర్వం సిద్ధంచేశారు. ఆగస్టు ఒకటో తేదీన నూరు శాతం పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 2,77,587 మంది లబ్ధిదారులకు రూ.116 కోట్ల 76లక్షలు ప్రభుత్వం కేటాయించింది. దీంతో వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, డప్పు కార్మికులు, చేనేత కార్మికులు వంటి లబ్ధిదారులందరికీ అదేరోజు అందజేస్తారు. గత నెల కూట మి ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి పెద్ద పండుగలా నిర్వహించింది. పెంచిన పింఛన్లకు తోడు మూడు నెలల అదనపు మొత్తంతో కలి పి ఏకంగా రూ.7 వేలు అందజేసింది. అదేవిధంగా దివ్యాంగులకు మూడు వేల నుంచి ఏకంగా రూ.6 వేలు అందించింది. దీంతో ఆయా వర్గాల్లో ఆనందానికి హద్దుల్లేకుండాపోయింది. ఈనెల అన్ని వర్గాల వారికి పింఛను కింద రూ.4 వేలు అందజేస్తారు. దివ్యాం గులకు ఇక ప్రతినెల రూ.6 వేలు అందజేస్తారు. ఈవిధంగా అంద జేసేందుకు జిల్లాలో అత్యధికంగా కాకినాడ అర్బన్‌ మండలంలో 30,303 మంది లబ్ధిదారులకు రూ.12.82 కోట్లు కేటాయించారు. జగ్గంపేట మండలంలో 12,208 మంది లబ్ధిదారులకు రూ.5.23 కోట్లు, కాజులూరు మండలంలో 10,137 మందికి రూ.4.19 కోట్లు కేటాయించారు. అలాగే కాకినాడ రూరల్‌ మండలంలో 18,294 మంది లబ్ధిదారులకు రూ.7.65 కోట్లు, ప్రత్తిపాడు మండలంలో 11,786 మందికి రూ.4.98 కోట్ల నిధులు సిద్ధం చేశారు. అలాగే తాళ్లరేవు మండలానికి 11,582 మంది లబ్ధిదారులకు రూ.4.84 కోట్లు, తొండంగి మండలానికి 12,638 మందికి రూ.5.34 కోట్లు, తునికి 12,345 మందికి రూ.5.27 కోట్లు కేటాయించారు. జిల్లాలో ఇతర మండలాలకు కూడా లబ్ధిదారుల సంఖ్యను అనుసరించి నిధులు సిద్ధం చేశారు. గత నెల మాదిరిగానే సచివాలయ సిబ్బం దితోనే లబ్ధిదారుల ఇంటికే ఈ పింఛన్లను తీసుకెళ్లి అందజేస్తారు. ఒకేరోజు పింఛన్లు అందరికీ అందజేసేవిధంగా అధికారులు చర్య లు చేపట్టారు. కాగా ఈనెల ఒకటో తేదీన ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ సమయంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలా ల్లో ఉదయం సమయంలో సర్వర్లు మొరాయించాయి. దీనివల్ల పింఛన్ల పంపిణీలో కొద్దిగా జాప్యం జరిగింది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కొత్త దరఖాస్తుదారుల ఆశలు

జిల్లాలో ఇటీవల ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరి ష్కార వ్యవస్థతోపాటు జిల్లాలో ఇతర మండలాల్లో అధికారులకు అర్జీలు సమర్పించారు. దీంతో ఈ దరఖాస్తుదారులు పింఛన్ల మం జూరు కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. తమకు పింఛను మంజూరు చేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా మంజూరుపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.

Updated Date - Jul 28 , 2024 | 09:00 AM