Share News

మళ్లీ ఎన్నికలు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:57 AM

ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురంఅర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల సందడి మొద లైంది..తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్యానల్‌ కూడా సిద్ధమైంది. రేపోమాపో వారి పేర్లను ప్రకటించనున్నారు. మొత్తం 12 మంది డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.

మళ్లీ ఎన్నికలు
ఆర్యాపురంఅర్బన్‌ బ్యాంక్‌

నోటిఫికేషన్‌ జారీ చేసిన అధికారులు

11వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ

చివరిగా 2013లో ఎన్నికలు

చైర్మన్‌ రేసులో చల్లా శంకరరావు

వైసీపీ పోటీలో ఉంటుందా?

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురంఅర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల సందడి మొద లైంది..తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్యానల్‌ కూడా సిద్ధమైంది. రేపోమాపో వారి పేర్లను ప్రకటించనున్నారు. మొత్తం 12 మంది డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.అందులో రెండేసి సీట్లు తమకు ఇవ్వాలని జనసేన, బీజేపీ వర్గాలు పట్టుబడుతున్నాయి. కానీ టీడీపీ చెరొకటి ఇస్తామని చెబుతు న్నట్టు సమాచారం. దీనిపై రేపో మాపో స్పష్టత రానుంది. చైర్మన్‌ పదవి రేసులో అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ చల్లా శంకరరావు రేసులో ఉన్నారు.ఇక ప్రతిపక్ష వైసీపీ ఓటమి భారంతో బాధపడుతోంది. సొంతంగా ప్యానల్‌ కట్టే పరిస్థితి కనిపించడంలేదు. ఇటీవల కొందరు దీనిపై చర్చించుకున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను కొందరు కలిసి పోటీపై చర్చించి నట్టు సమాచారం.కానీ ఇంకా స్పష్టత లేదు. మరొక పక్క వామపక్షాలు, ఇతర పార్టీలు పాలకవర్గ ఎన్నిక ఏకగ్రీవం కావాలని పట్టుబడుతున్నారు. టీడీపీ కూటమి మాత్రం ఎన్నికలకైనా సిద్ధమవుతోంది. ఎన్నికలు జరుగు తాయా, పాలకవర్గం ఏకగ్రీవం అవుతుందా అనేది తేలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈ ఎన్నికల కోసం వివిధ వర్గాలతో మం తనాలు జరుపుతున్నారు. కూటమి నేతలుగా ఎంపీ దగ్గుబాటి పురం దేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ జోక్యంతో కూటమి అభ్యర్థుల ఎంపిక ఖరారయ్యే అవకాశం ఉంది.

11న నామినేషన్ల స్వీకరణ.. 20న పోలింగ్‌

అర్బన్‌ బ్యాంక్‌కు గురువారం ఎన్నికల అధికారి వి. కృష్ణకాంత్‌ నోటిఫి కేషన్‌ జారీ చేశారు. చివరగా 2013లో ఎన్నికల జరిగాయి. 2018లో తిరిగి జరగాలి. అప్పటి నుంచి వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ నామినేషన్లు స్వీక రిస్తారు. అదే రోజున ఎన్నికల అధికారి దాఖలైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు. 12వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్ర్కూట్నీ ఉంటుంది. తుది జాబితా ప్రకటిస్తారు.20వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. 22న కొత్తపాలకవర్గం సమావేశమైన కొత్త చైర్మన్‌ను ఎన్నుకుంటారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ సుమా రు రూ.1080 కోట్ల టర్నోవర్‌తో మొత్తం 16 బ్రాంచిలు ఉన్నాయి. రాజమహేంద్రవరం మెయిన్‌ బ్రాంచి,కాతేరు, తిలక్‌రోడ్‌లోని స్వరాజ్‌నగర్‌, కోటగుమ్మం, బొమ్మూరు, దానవాయిపేట, దివాన్‌చెరువు, జెఎన్‌రోడ్డుతో 9 బ్రాంచిలు రాజమహేంద్రవరంలోనే ఉన్నాయి.గుంటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం,విశాఖ,తణుకు,అమలాపురం,కాకినాడలలో ఒక్కో బ్రాంచి ఉన్నా యి. 78423 మంది ఓటర్లు ఉన్నారు.రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో మొత్తం 12 మంది డైరెక్టర్లును ఎన్నుకుంటారు. ఎన్నికైన 12 మంది డైరెక్టర్లు కలసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. మొత్తం ఆర్యాపురం బ్యాంక్‌ పరిధిని మూడు నియోజకవర్గాలుగా విభజించారు.1వ నియోజకవర్గం రాజమహేంద్రవరం బ్రాంచిల పరిధి లోని ఓటర్లు 10మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు.ఎక్కువ ఓటర్లు ఇక్కడే ఉంటారు.కాకినాడ, తాడేపల్లిగూ డెం,తణుకు బ్రాంచిలకు ఒక డైరెక్టర్‌,దివాన్‌చెరువు, భీమవరం, అమలాపురం,వైజాగ్‌ (సీతమ్మ ధార), గుంటూరు బ్రాంచిలకు ఒక డైరెక్టరును ఎన్నుకుంటారు.

Updated Date - Jul 05 , 2024 | 12:57 AM