Share News

కాకినాడ జేఎన్టీయూకు ఏపీఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:43 AM

కాకినాడ జేఎన్టీయూకు ఏపీఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలు

కాకినాడ జేఎన్టీయూకు ఏపీఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలు

చైర్మన్‌గా వ్యవహరించనున్న ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు

జేఎన్టీయూకే, ఫిబ్రవరి 6: రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపిసెట్‌) 2024 నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూకు అప్పగించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం జేఎన్టీయూకే వరుసగా 7సార్లు ఏపీఈఏపిసెట్‌ ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలను ఎటువంటి అవరోధాలకు తావు లే కుండా షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించేందుకు తగినచర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు దీనికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారని రిజిస్ట్రార్‌ సు మలత తెలిపారు. ఏపీఈఏపిసెట్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించడంపట్ల రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఉన్న త విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరా వు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె. హేమచంద్రారెడ్డిలకు వీసీ కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ఇలా...

జేఎన్టీయూకే ఆధ్వర్యంలో 2015, 16,17,18,19 సంవత్సరాలలో నిర్వహించిన ఏపీఈఏపిసెట్‌లకు ప్రొఫెసర్‌ సీహెచ్‌సాయిబాబు కన్వీనర్‌గా వ్యవహరించగా 2015,16 లలో ఆఫ్‌లైన్‌లోనూ, 2017,18,19లలో ఆన్‌లైన్‌లోనూ నిర్వహించారు. అదేవిధంగా 2020,21 సంవత్సరాలలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీ ఈఏపిసెట్‌ ప్రవేశపరీక్షకు ప్రొఫెసర్‌ వి. రవీం ద్ర కన్వీనర్‌గా వ్యవహరించారు. కాగా జేఎన్టీయూకేలో గతంలో పలు ప్రవేశ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ప్రావీణ్యం కలిగిన సీనియర్‌ ప్రొఫెసర్లను కాదని అనుభవంలేని వ్యక్తిని కన్వీనర్‌గా నియమిస్తున్నారన్న సమాచారంతో వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

Updated Date - Feb 07 , 2024 | 01:43 AM