Share News

మొదటిరోజు ప్రశాంతంగా ఏపీఈఏపీ సెట్‌

ABN , Publish Date - May 16 , 2024 | 11:54 PM

ఏపీఈఏపీసెట్‌-2024 ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ఏపీ, హైదరాబాద్‌లోని 49 ప్రాంతీయ కేంద్రాల్లో మొదటిరోజు ప్రశాంతంగా జరిగినట్లు సెట్‌ చైర్మన్‌, వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల నిర్వహణాతీరును వర్సిటీలోని ఈఏపీసెట్‌ కార్యాలయంలో కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి, కోకన్వీనర్లు, కోఆర్డినేటర్లతో కలిసి గురువారం పరిశీలించారు.

మొదటిరోజు ప్రశాంతంగా ఏపీఈఏపీ సెట్‌

జేఎన్టీయూకే, మే16: ఏపీఈఏపీసెట్‌-2024 ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ఏపీ, హైదరాబాద్‌లోని 49 ప్రాంతీయ కేంద్రాల్లో మొదటిరోజు ప్రశాంతంగా జరిగినట్లు సెట్‌ చైర్మన్‌, వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల నిర్వహణాతీరును వర్సిటీలోని ఈఏపీసెట్‌ కార్యాలయంలో కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి, కోకన్వీనర్లు, కోఆర్డినేటర్లతో కలిసి గురువారం పరిశీలించారు. కాకినాడ జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగానికి సంబంధించి ఉదయం నిర్వహించిన పరీక్షకు 921మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 819మంది హాజరయ్యారని, 102మంది గైర్హాజరు కాగా 88.93 శాతం హాజరు నమోదైనట్లు కన్వీనర్‌ వెంకటరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 915మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 836మంది హాజరయ్యారని, 79మంది పరీక్ష రాయలేదని మొత్తం 91.37శాతం హాజరు నమోదైందన్నారు. మొత్తం రెండు సెషన్‌లకు కలిపి 1836మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1655మంది హాజరయ్యారని 181 మంది గైర్హాజరు కాగా మొత్తం 90.14 శాతం హాజరు నమోదైనట్లు కన్వీనర్‌ తెలిపారు. శుక్రవారం కూడా అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలు ఈ నెల 23 వరకూ కొనసాగుతాయని తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 11:54 PM