Share News

నేటి నుంచి ఏపీఈఏపీ సెట్‌

ABN , Publish Date - May 16 , 2024 | 12:58 AM

ఏపీలో 47, తెలంగాణలోని 2, మొత్తం 49 ప్రాంతీయ కేంద్రాల్లో కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఈనెల 16నుంచి 23 వరకూ నిర్వహించనున్న ఏపీఈఏపీసెట్‌కు మొత్తం 3,61,640మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి తెలిపారు.

 నేటి నుంచి ఏపీఈఏపీ సెట్‌

జేఎన్టీయూకే, మే 15: ఏపీలో 47, తెలంగాణలోని 2, మొత్తం 49 ప్రాంతీయ కేంద్రాల్లో కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఈనెల 16నుంచి 23 వరకూ నిర్వహించనున్న ఏపీఈఏపీసెట్‌కు మొత్తం 3,61,640మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి తెలిపారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఇంజనీరింగ్‌కు 2,73,010 మంది, అగ్రికల్చర్‌ ఫార్మసీ పరీక్షకు 87,419 రెండింటికీ 1211 మంది దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 7న విడుదల చేశామని విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌టిక్కెట్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను ఎంటర్‌ చేసి హాల్‌ టికెట్లను పొందవచ్చన్నారు. పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ అగ్రికల్చర్‌ ఫార్మసీ పరీక్షలు 16నుంచి 17వరకూ, ఇంజనీరింగ్‌ పరీక్షలు 18 నుంచి 23 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నామని కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి చెప్పారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్య, విద్యుత్‌, పోలీస్‌ అధికారులకు, అన్ని జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2342499, 2359599 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ పరీక్షలకు కాకినాడ జిల్లాలో 11,509 మంది విద్యార్థులు హాజరుకానున్నారని కాకినాడ అచ్యుతాపురం రైల్వేగేటు సమీపంలోని ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌, ప్రగతి ఇంజనీరింగ్‌, ఆదిత్య ఇంజనీరింగ్‌ కాలేజ్‌, ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కేంద్రాల్లో నిర్వహించనున్నామన్నారు. మొత్తం 8రోజులపాటు ఆన్‌లైన్‌లో జరిగే అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు 3620మంది విద్యార్థులు, ఇంజనీరింగ్‌ పరీక్షలకు 7865 మంది, రెండింటికీ 24మంది విద్యార్థులు హాజరుకానున్నారని కన్వీనర్‌ తెలిపారు. అమలాపురం పరిధిలోని భట్లపాలెంలో ఉన్న బీవీసీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, రాజమహేంద్రవరం పరిఽధిలోని లూఽథర్‌గిరిలో ఉన్న ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌లోనూ పరీక్షలను నిర్వహించనున్నామన్నారు.

Updated Date - May 16 , 2024 | 12:58 AM