Share News

విద్యార్థుల సమగ్ర సమాచారానికే.. అపార్‌కార్డులు

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:41 AM

వరదలు సంభవించినప్పుడు, ఏవైనా అగ్నిప్రమాదాలు జరిగినపుడు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలన్నీ వరదల పాలవడమో, కాలి బూడిదవడమో, ప్రయాణ సమయాల్లో వాటిని కోల్పోవడమో జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలతోపాటు విద్యావిషయక పురోగతిని డిజిలాకర్లో భద్రపరుచుకునేలా ప్రభుత్వం ఆటోమేటెడ్‌ పెర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ(అపార్‌)ను రూపొందించింది. విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని దీనిలో భద్రపరచనున్నారు.

విద్యార్థుల సమగ్ర సమాచారానికే..   అపార్‌కార్డులు

  • 12 అంకెలతో గుర్తింపు కార్డు

  • జిల్లాలో కార్డుల జనరేట్‌ ప్రక్రియ

  • ఇప్పటివరకూ 10శాతం పూర్తి

వరదలు సంభవించినప్పుడు, ఏవైనా అగ్నిప్రమాదాలు జరిగినపుడు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలన్నీ వరదల పాలవడమో, కాలి బూడిదవడమో, ప్రయాణ సమయాల్లో వాటిని కోల్పోవడమో జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలతోపాటు విద్యావిషయక పురోగతిని డిజిలాకర్లో భద్రపరుచుకునేలా ప్రభుత్వం ఆటోమేటెడ్‌ పెర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ(అపార్‌)ను రూపొందించింది. విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని దీనిలో భద్రపరచనున్నారు.

కాకినాడరూరల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): 1వ తరగతి నుంచి పీజీ వరకూ చదివే ప్రతి విద్యార్థి కి అపార్‌కార్డును అందించేందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది. అపా ర్‌కార్డుపై క్యూఆర్‌ కోడ్‌తోపాటు 12అంకెల గుర్తిం పు సంఖ్య ఉంటుంది. జాతీయస్థాయిలో ప్రతి వి ద్యార్థికి జీవితకాలం ఉపయోగపడేలా ఈకార్డును రూపొందించారు. 12 అంకెల నెంబరు ఆధారంగా విద్యార్థులు ఎక్కడినుంచైనా వారి ధ్రువీకరణ ప త్రాలను పొందే వీలుంటుంది. విద్యార్థులకు సం బంధించిన ఆయా అంశాల పురోగతిని పాఠశాల ల నిర్వాహకులు అపార్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా వారికి ప్రయోజనం కలుగుతుంది. ఉన్నత విద్య, ఉద్యోగంకోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, వేరే విద్యాసంస్థలోకి మారినప్పుడు మొత్తం సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది.

వన్‌ నేషన్‌ వన్‌ స్టూడెంట్‌ నినాదం

జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా వన్‌నేషన్‌ వన్‌ స్టూడెంట్‌ నినాదంతో కేంద్ర ప్ర భుత్వ విద్యాశాఖ అపార్‌కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. ఆధార్‌కార్డులు కూడా ఇదే తరహాలో ఉ న్నాయి. దేశంలో ఒకవ్యక్తికి ఉన్న ఆధార్‌ నెంబరు మరో వ్యక్తికి ఉండదు. ఇదే తరహాలో విద్యార్థులకు కూడా గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. విద్యార్థులకోసం డిగ్రీలు, స్కాలర్‌షిప్‌లు, రివార్డులు, ఇతర క్రెడిట్‌లతో సహా అకడమిక్‌ డేటాను డిజిటల్‌గా కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అపార్‌కార్డులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫొటో, క్యూఆర్‌ కోడ్‌, 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ విద్యార్థి వివరాలన్నీ వస్తాయి. 18ఏళ్లలోపు విద్యార్థులకు అపార్‌ ఐడీని రూపొందించేందుకు తల్లిదండ్రుల అనుమతి కోరుతూ సంబంధిత పాఠశాలల, కళాశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్‌ అనుమ తి పత్రాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే అపార్‌పై అవగాహన కల్పించి అనుమతి పత్రాలను తీసుకుంటున్నారు.వాటిని పాఠశాలలో భద్రపరచి దాని డిజిటల్‌ కాఫీని పాఠశాల సమన్వయకర్త ద్వారా యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 2,98,956మంది ఉండగా వారిలో ఇప్పటి వరకూ 30,000 వరకూ గల విద్యార్థులకు అపార్‌ కార్డులను జనరేట్‌ చేశారు. అంటే సుమారుగా 10శాతం మంది విద్యార్థులకు మాత్రమే ఈప్రక్రియ పూర్తయింది.

అపార్‌ ప్రయోజనాలు

జాతీయస్థాయిలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను ఇప్పటికే యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. వాటికి అనుగుణంగా అపార్‌ కార్డుకోసం హెచ్‌ఎం ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఐడీ వచ్చిన అనంతరం ధ్రువీకరణకోసం తల్లిదండ్రులు నమోదు చేసుకున్న ఫోన్‌ నెంబరుకు నిర్ధారణకోసం ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయగానే ఆన్‌లైన్‌లో అపార్‌ గుర్తింపు కార్డు జారీ చేస్తారు. ఇది విద్యార్థి బ్యాంకు ఖాతా వివరాలతో అనుసంధానమవుతుంది. విద్యార్థి ప్రవేశపరీక్షలు, ఉపకార వేతనాలు, ఉద్యోగాల భర్తీ సమయంలో ఈ కార్డు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

విద్యార్థులకు అపార్‌కార్డు చాలా కీలకం

-జి.నాగమణి, ఆర్జేడీ

విద్యార్ధులకు భవిష్యత్‌లో అపార్‌కార్డు చాలా కీలకం కానుంది. తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తూ వారి సమ్మతి పత్రాలను తీసుకునేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఈ కార్డు ద్వారా ఒక్క క్లిక్‌తో సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.

Updated Date - Oct 27 , 2024 | 12:41 AM